AP News: మర్రి చెట్టు తొర్రలో @ 66 లక్షలు
ABN , Publish Date - Apr 21 , 2024 | 08:59 PM
పాపం ఆ దొంగలకు.. దొంగిలించిన సొమ్ము ఎక్కడ దాచాలో అర్థం కాలేదనుకుంటా. అందుకే మర్రి చెట్టు తొర్రలో దాటి పెట్టారు. అది కూడా ఒకటి.. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ. 66 లక్షలు. అయితే దొంగతనం జరిగిందన్న తర్వాత.. పోలీసులు ఉరుకుంటారా? ఆ దొంగలను పట్టుకొన్నారు.
పాపం ఆ దొంగలకు.. దొంగిలించిన సొమ్ము ఎక్కడ దాచాలో అర్థం కాలేదనుకుంటా. అందుకే మర్రి చెట్టు తొర్రలో దాటి పెట్టారు. అది కూడా ఒకటి.. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ. 66 లక్షలు. అయితే దొంగతనం జరిగిందన్న తర్వాత.. పోలీసులు ఉరుకుంటారా? ఆ దొంగలను పట్టుకొన్నారు. తమదైన శైలిలో విచారణ జరిపారు. అంతే దోచిన నగదు.. అదే రూ. 66 లక్షల నగదు మర్రి చెట్టు తొర్రలో దాచినట్లు చెప్పేశారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నగరంలో ఇటీవల ఏటీఎంలో నగదు నింపే వ్యాన్ నుంచి రూ.66 లక్షలు దుండగులు దొచుకేళ్లారు. ఈ దోపిడిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అంతే పోలీసులు రంగంలోకి దిగారు. ఆ క్రమంలో వారు టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించారు. నిందితులు సిఎంఎస్ మాజీ ఉద్యోగి ఎస్ మహేష్‌బాబు, ఆర్ రాజశేఖర్, జి కొండారెడ్డిగా పోలీసులు గుర్తించారు.
Taraka Ratna: ఎన్నికల వేళ.. అలేఖ్య రెడ్డి ట్విట్ వైరల్
నగరంలోని వివిధ ఏటీఎంల్లో నగదు నింపేందుకు సీఎంఎస్ సెక్యూరిటీ కంపెనీ సిబ్బంది.. రూ. 68 లక్షలు తీసుకు వెళ్లింది. అయితే కర్నూలు రోడ్డులోని ఓ హోటల్ వద్ద భోజనం చేసేందుకు ఆ వాహనాన్ని నిలిపారు. వారు భోజనం చేసి వచ్చే సరికి వాహనంలోని రూ. 66 లక్షలు చోరీ జరిగినట్లు గుర్తించారు.
AP Elections: నామినేషన్ వేయనున్న చింతమనేని
ఆ వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పేర్నమిట్ట వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లి విచారించగా.... మర్రి చెట్టు తొర్రలో దోచిన సొమ్ము రూ. 66 లక్షలు దాచినట్లు వెల్లడించారు. వీరి చెప్పిన వివరాల ఆధారంగా మర్రి చెట్టు తొర్రలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Kadapa Politics: వైయస్ అవినాశ్ రెడ్డి ఓటమి ఖాయమా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..