AP News: ఏపీ సీఐడీ పేరుతో ఐటీ కంపెనీపై దాడి.. పరారీలో కర్నూలు ఎస్సై
ABN , Publish Date - Jan 31 , 2024 | 07:14 AM
కర్నూలు ఎస్సై సృజన్ పరారీలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ సీఐడీ పేరుతో బెదిరింపు కేసులో నిందితుడిగా ఉన్నారు. అసలేం జరిగిందంటే.. డీఐజీ కార్యాలయంలో ఎస్సైగా పని చేస్తున్న సృజన్ పది మందితో కలిసి ముఠాను తయారు చేసుకున్నారు.
కర్నూలు: కర్నూలు ఎస్సై సృజన్ పరారీలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ సీఐడీ పేరుతో బెదిరింపు కేసులో నిందితుడిగా ఉన్నారు. అసలేం జరిగిందంటే.. డీఐజీ కార్యాలయంలో ఎస్సైగా పని చేస్తున్న సృజన్ పది మందితో కలిసి ముఠాను తయారు చేసుకున్నారు. ఇటీవల ఏజేఏ యాడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎండీ సుగుణాకరశెట్టిని తన ముఠాతో కలిసి వెళ్లి సీఐడీ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఈజీ మనీ కోసం ఏపీకి చెందిన ఓ ఎస్సై, న్యాయవాది, ఐటీ నిపుణుడు పథక రచన చేసినట్లు తేలింది. దీనికోసం సృజన్ అండ్ టీం సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎండీ సుగుణాకరశెట్టిని ఎంచుకుంది. ఏపీ సీఐడీ పేరు చెప్పి.. ఫేక్ ఐడీ కార్డులు చూపించి ఆకస్మిక తనిఖీలు చేయాల్సి ఉందని.. అవి ఆపాలంటే రూ.10 కోట్లు ఇవ్వాలంటూ సృజన్ ముఠా డిమాండ్ చేసింది. ఎండీ సుగుణాకర శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. సృజన్ మాత్రం పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.