YCP: నెల్లూరు రూరల్‌లో వైసీపీకి మరో భారీ షాక్..
ABN , First Publish Date - 2024-02-07T13:34:49+05:30 IST
ఇటీవలి కాలంలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అయితే పార్టీ తుడిచిపెట్టుకు పోయే పరిస్థితి వచ్చేసింది...
నెల్లూరు: ఇటీవలి కాలంలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అయితే పార్టీ తుడిచిపెట్టుకు పోయే పరిస్థితి వచ్చేసింది. నేడు నెల్లూరు రూరల్‌లో వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. సీనియర్ వైసీపీ నాయకులు వేమిరెడ్డి సురేంద్ర రెడ్ది వైసీపీకి రాజీనామా చేశారు. ఒక్కొక్కరుగా నెల్లూరు రూరల్‌లో ఆ పార్టీ నేతలంతా వైసీపీని వీడుతున్నారు. నరసింహ కొండ ఆలయ చైర్మన్‌గా.. దేవరపాడు ఉపసర్పంచ్ గా కొనసాగుతున్న సురేంద్ర రెడ్ది త్వరలోనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది ఆధ్వర్యంలో టీడీపీలో చేరనున్నారు.