Share News

AP BJP State Secretary : జగన్‌ ద్రోహం వందేళ్లయినా క్షమించలేం

ABN , Publish Date - Dec 06 , 2024 | 04:35 AM

రాష్ట్రానికి జగన్‌ చేసిన ద్రోహం మరో వందేళ్లయినా క్షమించరానిదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్‌ నాయుడు అన్నారు.

AP BJP State Secretary : జగన్‌ ద్రోహం వందేళ్లయినా క్షమించలేం

బిహార్‌ గ్యాంగ్‌లా దౌర్జన్యాలు: నాగోతు రమేశ్‌

అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి జగన్‌ చేసిన ద్రోహం మరో వందేళ్లయినా క్షమించరానిదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్‌ నాయుడు అన్నారు. బ్యూరోక్రాట్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు సహా ఎవరినీ ప్రశాంతంగా బతకనివ్వలేదని విమర్శించారు. బిహార్‌ గ్యాంగ్‌ తరహాలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో రమేశ్‌ నాయుడు గురువారం మాట్లాడారు. ఐదేళ్లలో జగన్‌ బెదిరింపులతో ఎందరో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయారని, కేవీ రావు తరహాలో ఆస్తులు వదులుకున్నారని అన్నారు. అవినీతి, బెదిరింపులతో దోచుకున్న భారీ మొత్తాన్ని జగన్‌ విదేశాలకు తరలించారని సంచలన ఆరోపణలు చేశారు.

Updated Date - Dec 06 , 2024 | 04:35 AM