Share News

Teacher MLC : ఎమ్మెల్సీగా బొర్రా గోపీమూర్తి ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - Dec 15 , 2024 | 05:41 AM

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పీడీఎఫ్‌ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థిగా..

Teacher MLC : ఎమ్మెల్సీగా బొర్రా గోపీమూర్తి ప్రమాణ స్వీకారం

అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజోతి): ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పీడీఎఫ్‌ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన బొర్రా గోపీమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతి అసెంబ్లీ భవన ప్రాంగణంలో శనివారం శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం ఎమ్మెల్సీ గోపీమూర్తికి చైర్మన్‌ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు కేఎస్‌ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ సూర్యదేవర ప్రసన్న కుమార్‌, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2024 | 05:41 AM