Home » MLC Candidate
డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేంతవరకు అతి దారుణంగా చంపేస్తానంటూ ఎమ్మెల్సీ విజయశాంతి భర్తను ఓ వ్యక్తి బెదిరించాడు. దాంతో అతడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కొద్దిరోజుల క్రితం జరిగిన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్, ఎమ్మెల్యే కోటా శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించిన వారు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణలో కొత్తగా పట్టభద్రులు, టీచర్స్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. వారితో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం శాసనమండలిలో ప్రమాణస్వీకారం చేయించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనా దాసోజు శ్రవణ్ మరో రోజు ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
కూటమి ప్రభుత్వంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఎంపికైన జనసేన నుంచి కొణిదల నాగేంద్ర రావు (నాగబాబు), బీజేపీ నుంచి సీనియర్ నేత సోము వీర్రాజులు బుధవారం శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
తమ ఆరేళ్ల పదవీ కాలాన్ని శనివారంతో పూర్తి చేసుకోబోతున్న తొమ్మిది మంది ఎమ్మెల్సీలకు శాసనమండలిలో గురువారం ఘనంగా వీడ్కోలు పలికారు.
మాజీ సీఎం జగన్‌కు సన్నిహితుడిగా పేరుపొందిన మరో నాయకుడు వైసీపీకి దూరం కానున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురు సభ్యులూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్; సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం; బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్‌కుమార్ ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది.
CM Revanth on MLC Seats: అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్ క్లారిటీ ఇచ్చారు. అలాగే గాంధీ కుటుంబంతో అనుబంధం అంతకు మించి అని.. దాన్ని ఫోటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదని సీఎం తెలిపారు.
ఎమ్మెల్యే కోటా పరిధిలోని ఐదు ఎమ్మెల్సీ సీట్లకు కాంగ్రెస్ తరఫున ముగ్గురు, సీపీఐ, బీఆర్ఎస్ తరపున ఒక్కొక్కరు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి ఐదు సీట్లకుగాను నాలుగింటిలో పోటీ చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్.. అందులో ఒకటి మిత్రపక్షం సీపీఐకి కేటాయించిన సంగతి తెలిసిందే.
MLC nomination process: రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ పర్వం ముగిసింది. తెలంగాణలో ఐదుగురు అభ్యర్థులు, ఏపీలో ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు.