డిస్కమ్‌ల బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలి
ABN , Publish Date - Dec 03 , 2024 | 04:58 AM
రాష్ట్రంలో విద్యుత్ డిస్కమ్‌లకు ఉన్న రూ.15,485 కోట్ల ట్రూ అప్ చార్జీల బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి
కాకినాడ పోర్టులో పవన్ కల్యాణ్ డ్రామా చేశారు
షర్మిలను నాయకురాలిగా గుర్తించడం లేదు: బొత్స
విశాఖపట్నం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్ డిస్కమ్‌లకు ఉన్న రూ.15,485 కోట్ల ట్రూ అప్ చార్జీల బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆ భారాన్ని ప్రజలపై మోపాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. ‘కాకినాడ పోర్టులో బియ్యం రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డ్రామా చేశారు. తన పార్టీకి చెందిన వ్యక్తే పౌర సరఫరాల మంత్రి అనే విషయాన్ని ఆయన మరిచిపోయి, కాకినాడ ఎమ్మెల్యేను ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉంది. కాకినాడ పోర్టు ఎవరిదనే విషయాన్ని పక్కనపెట్టి అక్కడ నుంచి చట్ట వ్యతిరేకంగా ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయా? లేదా? అనేది గుర్తించి చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వానికి ఒక విధానం లేదు. పీపీసీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిలను ఒక రాజకీయ నాయకురాలిగా మేం గుర్తించడం లేదు’ అని బొత్స తెలిపారు.