-
-
Home » Andhra Pradesh » Breaking News August 29th Today Latest Telugu News Live Updates
-
Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Aug 29 , 2024 | 10:12 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-08-29T17:42:26+05:30
వికారాబాద్ జిల్లా పరిగిలో భారీ వర్షం
సాయంత్రం 5 గంటలకే వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లే స్థాయిలో కురుస్తున్న వర్షం
ఈ వానాకాలం సీజన్ మొత్తంలో అక్కడ ఇదే భారీ వర్షం అంటున్న స్థానికులు
20 నిమిషాలుగా కురుస్తున్న వర్షం
-
2024-08-29T17:33:23+05:30
నటి జెత్వానీ కేసుపై విజయవాడ సీపీ స్పందన
నటి కాదంబరి జెత్వానీకి వైసీపీ టార్చర్ వ్యవహారంపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందంటూ కథనాలు వస్తున్నాయని, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలు పరిశీలిస్తున్నామని వెల్లడించారు. డీజీపీ ఈ కేసు వివరాలపై ఆరా తీశారని పేర్కొన్నారు.
‘‘స్రవంతి రాయ్ అనే అధికారిని విచారణ కోసం నియమించాం. బాధితురాలితో మాట్లాడి పూర్తి వివరాలు తీసుకుంటాం. చీటింగ్ కేసులో నటితో పాటు కుటుంబం మొత్తాన్ని ఎందుకు అరెస్టు చేశారో ఆరా తీస్తాం. ఆ రోజు ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందో దర్యాప్తులో తేలుతుంది. నాలుగైదు రోజుల్లో ఈ విచారణ పూర్తవుతుంది. మొత్తం ఈ కేసులో అన్ని కోణాల్లో సాంకేతికతతో ఆధారాలు సేకరిస్తాం. నివేదిక రూపంలో డీజీపీకి అందచేస్తాం. ఐపీఎస్‌ల పాత్ర ఉన్నట్లు తేలితే డీజీపీ చర్యలు తీసుకుంటారు’’ అని సీపీ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు.
-
2024-08-29T17:31:25+05:30
హీరోయిన్ జిత్వానీ వ్యవహారంలో కీలక పరిణామం
అమరావతి: ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వానీకి వైసీపీ టార్చర్ వ్యవహారంలో కీలక అప్‌డేట్ వచ్చింది. ఆమె ఈ రోజు రాత్రికి ముంబై నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. రాత్రి 8.30 గంటలకు ముంబైలో బయలుదేరి రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఏపీ పోలీసులు రక్షణతో ఆమెను విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. వైసీపీ టార్చర్ వ్యవహారానికి సంబంధించి కాదంబరి జెత్వానీ స్టేట్‌మెంట్‌ను రికార్డు విజయవాడ పోలీసులు పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఆమెను తీసుకొస్తున్నారు.
-
2024-08-29T16:43:34+05:30
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైడ్రా కూల్చివేతలపై రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్న వేళ.. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
నా ఇల్లు చట్టవిరుద్ధం గా ఉంటే కూల్చివేయాలి
నాకు టైమ్ ఇస్తే ఇంట్లో సామాన్ తీసుకొని బయటకు వెళ్తా
శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసు ఇచ్చారు
ఇప్పటివరకు నన్ను ఏ అధికారీ కలువలేదు
నేను 2016-17లో అమర్ సొసైటీలో ఒక నివాసాన్ని కొనుగోలు చేశాను
నివాసానికి కొనుగోలు చేసినప్పుడు ఈ బిల్డింగ్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందన్న సమాచారం నా దగ్గర లేదు
నా ఇల్లు బఫర్ జోన్‌లో ఉందంటూ చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చారు
1995 లోనే ఈ లే ఔట్‌కి పర్మిషన్ వచ్చింది
బీఆర్ఎస్ వాళ్లు నా ఇంటిని పట్టుకొని రాజకీయం చేస్తున్నారు
గత పదేళ్లలో ఎన్నో అక్రమాలు చేశారు
-
2024-08-29T14:20:05+05:30
హైడ్రా పేరుతో అవినీతి.. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైడ్రాపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు
వరుస ఫిర్యాదులపై సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి.. బెదిరించి
కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదులు
ఫిర్యాదులపై స్పందించి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి
గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు మూడేండ్ల కిందటి ఫిర్యాదులను..
అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు..
డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని అటువంటి వారిపై చర్యలు తప్పవని సీఎం వార్నింగ్
ఇలాంటి వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని..
ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు : రేవంత్ రెడ్డి
-
2024-08-29T14:15:13+05:30
నటి జిత్వానీ సంచలన పోస్ట్!
ఎక్స్‌లో ముంబై నటి జిత్వానీ పోస్ట్
సీఎం సార్.. కేసును 'సీబీఐ'దర్యాప్తునకు ఆదేశించండి
ఓ మహిళగా దారుణ దౌర్జన్యానికి గురయ్యా
గత ప్రభుత్వ పెద్దల కుట్రలో ఇబ్బందులకు గురయ్యా
ఈ కుట్రలో ఉన్నతాధికారులు భాగస్వాములయ్యారు
వైఎస్ జగన్, సజ్జల పాత్రలను కూడా వెలికి తీయించండి: 'X'లో జిత్వానీ
-
2024-08-29T14:00:01+05:30
జగన్‌కు థ్యాంక్స్.. రాజీనామాకు కారణాలివే
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ
రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు
పార్టీలో ఏడాది కాలంగా జరుగుతున్న పరిణామాలతో రాజీనామా చేశాను
ఐదేళ్ల నుంచి రాజకీయంగా గౌరవంగా తలెత్తుకునే..
విధంగా అవకాశం కల్పించిన వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు
పరువు ప్రతిష్టల గురించి కొందరు మాట్లాడుతున్నారు
40 ఏళ్ల నుంచి గౌరవప్రదంగా రాజకీయం చేస్తున్నాను
ప్రజల మధ్య ఉంటున్నాను : మోపిదేవి వెంకటరమణ
-
2024-08-29T13:42:50+05:30
మీడియాతో మోపిదేవి వెంకట రమణ
ఢిల్లీ: ఏడాది నుంచి జరుగుతున్న పరిణామాలతో నిర్ణయం తీసుకున్నా: మోపిదేవి వెంకటరమణ
ఐదేళ్ల నుంచి రాజకీయంగా, గౌరవంగా తలెత్తుకునే విధంగా అవకాశం కల్పించిన జగన్‌కు ధన్యవాదాలు.
పరువు, ప్రతిష్టల గురించి కొందరు మాట్లాడుతున్నారు
40 ఏళ్ల నుంచి గౌరవప్రద రాజకీయాల్లో ఉన్నా, ప్రజల మధ్య ఉంటున్నాను
-
2024-08-29T13:02:15+05:30
వైసీపీకి వరస షాక్‌లు
ఢిల్లీ: మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు బాటలో మరికొంతమంది వైఎస్ఆర్సీపీ ఎంపీలు
సరైన సమయంలో నిర్ణయం వెల్లడిస్తానన్న గొల్ల బాబురావు
ఢిల్లీలో ఉన్న బాబురావు
వైసీపీకి రాజీనామా గురించి బాబురావు వద్ద ప్రస్తావించిన మీడియా ప్రతినిధులు
ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పనుల కోసం ఢిల్లీ వచ్చానని బాబు రావు వెల్లడి
ఇప్పటికైతే అలాంటిదేమీ లేదు: బాబు రావు
సరైన సమయంలో చెబుతానని బాబురావు ప్రకటన
సమయం ఎప్పుడని ప్రశ్నిస్తే నవ్వుకుంటూ కారు ఎక్కి వెళ్లిపోయిన బాబురావు
-
2024-08-29T12:58:33+05:30
ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు కల్వకుంట్ల కవిత
సిద్దిపేట: ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత
కవితతో పాటు భర్త అనిల్, కుమారుడు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి
లిక్కర్ స్కామ్‌లో బెయిల్ మీద బయటకు వచ్చిన కవిత
ఫామ్ హౌస్‌లో తండ్రిని కలిసిన కవిత
-
2024-08-29T12:40:19+05:30
రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి, బీద రాజీనామా
ఢిల్లీ: వైసీపీకి ఎంపీల షాక్
రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు
పార్లమెంట్‌లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్‌కు రాజీనామా లేఖలను అందజేసిన నేతలు
వైసీపీకి రాజీనామా చేసిన ఇరువురు నేతలు
-
2024-08-29T12:35:20+05:30
సినీ నటి కేసుపై విజయవాడ పోలీస్ కమిషనర్
విజయవాడ: ముంబై నటి కేసుపై స్పందించిన విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు.
సినీ నటి కేసు దర్యాప్తులో ఉంది
కేసుకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం.
కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు వచ్చాయి
ఐపీఎస్ అధికారులపై వచ్చిన ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని పరిశీలిస్తు్న్నాం.
ఐపీఎస్ అధికారులపై వచ్చిన ఆరోపణలపై డీజీపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
-
2024-08-29T12:29:08+05:30
సీఎస్ శాంతికుమారి సమీక్ష
హైదరాబాద్: అక్రమ కూల్చివేతలపై అధికారులతో సమీక్ష
హాజరైన జీహెచ్‌ఎంసీ, హైడ్రా, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ శాఖ, నీటిపారుదల, వీఅండ్‌ఈ, ఏసీబీ, పోలీసు శాఖల అధికారులు
అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ ప్రారంభించే ముందు ప్రొసిజర్స్ ఫాలో కావాలని అధికారులకు ఆదేశం
కూల్చివేతలకు సంబంధించి హైకోర్టు ఆదేశాలను పాటించాలని అధికారులకు ఆదేశం
సమీక్షలో పాల్గొన్న హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లు
-
2024-08-29T12:20:22+05:30
articleText
-
2024-08-29T12:20:07+05:30
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఏంటంటే..
దిశా పోలీస్ స్టేషన్ల పేర్లు మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్యులు.
దిశా పోలీస్ స్టేషన్ ఇకపై మహిళా పోలీస్ స్టేషన్‌గా మార్పు.
దిశా చట్టాన్ని వెనక్కి తీసుకొని, దిశా పోలీస్ స్టేషన్లను కొనసాగించిన జగన్ సర్కార్.
-
2024-08-29T12:02:08+05:30
గుజరాత్‌లో జల ప్రళయం..
గుజరాత్‌లో వర్ష బీభత్సం
గత మూడురోజుల నుంచి ఎడతెరపి లేకుండా వాన
వర్షాలతో 28 మంది మృతి
ఆనంద్‌లో ఆరుగురు, అహ్మదాబాద్‌లో నలుగురు, గాంధీనగర్, ఖేదా, మిహిసాగర్, దాహొద్, సురేంద్రనగర్‌లో ఇద్దరు మృతి
మోర్బి, వడొదర, భారుచ్, జామ్ నగర్, ఆరావల్లి, పంచమహల్, ద్వారాక, దంగ్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి
18 వేల మందిని రక్షించిన సిబ్బంది
11 జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురవొచ్చని ఐఏండీ ప్రకటన
ట్రాక్టర్‌లో వెళుతోన్న ఏడుగురు గల్లంతు
ఆర్మీ సాయం కోరిన గుజరాత్
-
2024-08-29T11:34:26+05:30
సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి: కార్మిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
పరిశ్రమల్లో ప్రమాద నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చ.
సేఫ్టీ ఆడిట్ నిర్వహణపై దిశా నిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు.
ధర్డ్ పార్టీతో సేఫ్టీ ఆడిట్ చేయించడం ఎంత వరకు కరెక్ట్ అనే అంశంపై సమాలోచనలు.
ప్రమాదకర రసాయనాలు నిల్వ ఉంచే ఫ్యాక్టరీల్లో తనిఖీలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం.
తనిఖీలు జరపడం.. పరిశ్రమలకు వ్యతిరేకం కాదనే విషయాన్ని పారిశ్రామిక వేత్తలకు వివరించనున్న సర్కార్.
-
2024-08-29T11:25:16+05:30
ఓటుకు నోటు కేసు పిటీషన్ డిస్మిస్
ఓటుకు నోటు కేసు పిటీషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు
కేసు విచారణ తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్
పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవై నేతృత్వంలోని ధర్మాసనం
జగదీశ్వర్ రెడ్డి తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సుందరం
కేసులో నిందితుడు సీఎంగా ఉన్నారు, హోంశాఖ కూడా స్వయంగా ఆయన చేతిలోనే ఉంది - సుందరం
కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే మన న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే - బెంచ్
సీఎం రేవంత్ వ్యాఖ్యలు చూస్తేనే తెలుస్తుంది. పైగా కౌంటర్స్ లో కూడా వైఖరి మారింది
అలాంటప్పుడు స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఏర్పాటు చేస్తాం - బెంచ్
పిటిషన్ ను డిస్మిస్ చేస్తాం. మాకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది - బెంచ్
మధ్యాహ్నం గం. 2.00కు ఆర్డర్ ఇస్తాం. తెలంగాణ హైకోర్టు ను సంప్రదించి ఆర్డర్ ఇస్తాం - బెంచ్
-
2024-08-29T11:14:13+05:30
ఓటుకు నోటు కేసు విచారణ
ఢిల్లీ: సుప్రీంకోర్టులో ప్రారంభమైన ఓటుకు నోటు కేసు విచారణ
విచారణ జరుపుతున్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ధర్మాసనం
-
2024-08-29T10:29:43+05:30
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
అమరావతి: వైసీపీ ప్రభుత్వంలో చేసిన పనులు బిల్లులు చెల్లింపుపై చర్చ
ఆర్థికశాఖ మంత్రి ఆమోదం లేకుండా బిల్లుల చెల్లింపు
ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు పెండింగ్
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పనులకు బిల్లులు విడుదల చేయడంపై ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ విస్మయం
ఆర్థికమంత్రి జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో.. ఆయనకు తెలియకుండా బిల్లుల విడుదల చేసినట్లు సమాచారం
ఏ ప్రాతిపదికన బిల్లులు చెల్లింపు జరిగిందనే అంశంపై ఆరా తీస్తున్న మంత్రి పయ్యావుల కేశవ్
యూసీల పేరుతో బిల్లులు చెల్లింపు జరిగిందనే వాదన తెరపైకి తెచ్చిన ఆర్థికశాఖ వర్గాలు
మొత్తం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుకి నివేదిక ఇచ్చేందుకు సిద్దమైన ఆర్థిక మంత్రి పయ్యావుల
-
2024-08-29T10:18:07+05:30
మచిలీపట్నం-రేపల్లే రైల్వే లైన్‌కు ముందడుగు
అమరావతి: మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ నిర్మాణంపై స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
ఎంపీ బాలశౌరి అభ్యర్థన మేరకు రైల్వే లైన్ నిర్మాణంపై అధ్యయనం
ఈ నెల 6వ తేదీన రైల్వే మంత్రిని కలిసి రైల్వే లైన్ నిర్మాణం ఆవశ్యకతను తెలిపిన ఎంపీ బాలశౌరి
రైల్వే లైన్ నిర్మాణం గురించి పరిశీలిస్తామని ఎంపీ బాలశౌరికి అధికారికంగా లేఖ రాసిన రైల్వే మంత్రి
రైల్వే లైన్ నిర్మాణంపై సానుకూలంగా ఉన్న రైల్వే మంత్రి- ఎంపీ బాలశౌరి
దివిసీమ ప్రజల చిరకాల కోరిక మచిలీపట్నం-రేపల్లే రైల్వే లైన్ సాకారం చేసేందుకు కృషి చేస్తా - ఎంపీ బాలశౌరి
-
2024-08-29T10:12:38+05:30
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.