-
-
Home » Andhra Pradesh » Breaking News December 3rd Today Latest Telugu News Live Updates Sdr
-
Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Dec 03 , 2024 | 10:07 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-12-03T21:20:31+05:30
ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం..
అమరావతి: ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నభోజనం!
ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని నిర్ణయం.
పండుగ వాతావరణంలో మెగా పిటిఎం నిర్వహణ.
చాగంటి సూచనలమేరకు నైతిక విలువలపై పాఠ్యాంశాలు.
పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యపై మంత్రి లోకేష్ సమీక్ష.
-
2024-12-03T19:29:33+05:30
స్కూల్ బస్సులో షాట్ సర్క్యూట్..
వికారాబాద్: పరిగిలోని బృంగి స్కూల్ బస్సులో షాట్ సర్క్యూట్.
దీంతో బస్సులో చెలరేగిన పొగలు.
అప్రమత్తమైన బస్సు డ్రైవర్...బస్సును నిలిపి వేయడంతో తృటిలో తప్పిన ప్రమాదం.
ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 60 విద్యార్థులు.
వెంటనే బస్సు నుండి విద్యార్థులను బయటకు దింపిన స్థానికులు.
భయాందోళనకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు.
షాట్ సర్క్యూట్ వల్లే పొగలు చేలరేగి ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు.
-
2024-12-03T16:41:47+05:30
అదే జరిగితే.. జగన్‌కు ఇక చుక్కలే..
అమరావతి: భూదందాలపై ఉక్కు పాదం మోపుతాం: రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
ఇప్పటికే భూదురాక్రమణ (నిరోధక) చట్టం 2024ను తీసుకొచ్చాం.
జగన్ రెడ్డి అరాచకపాలనలో వైసీపీ నేతలు ప్రజల ఆస్తులను లాక్కున్నారు.
కాకినాడ పోర్టులో ప్రధాన వాటాను లాక్కొని అరబిందో వాళ్లకు కట్టబెట్టడం జగన్ రెడ్డి అరాచకానికి ఉదాహరణ.
భూ దందాలపై కూటమి ప్రభుత్వానికి దాదాపు 10 వేలకు పైగా ఫిర్యాదులు అందాయి.
ఈనెల 6వ తేదీ నుండి జరగనున్న రెవిన్యూ సదస్సుల్లో వైసీపీ నేతల భూ దందాలపై కూడా ప్రజలు ఫిర్యాదులు ఇవ్వవచ్చు.
భూ దందాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవు.
జగన్ హయాంలో భారీగా భూఆక్రమణలు జరిగాయని.
అక్రమార్కుల తాట తీస్తామని మంత్రి హెచ్చరించారు.
-
2024-12-03T16:16:03+05:30
హరీష్ రావుపై కేసు నమోదు..
సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.
సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు.
తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని పంజాగుట్ట పోలీసులకు చక్రధర్ ఫిర్యాదు.
దీంతో హరీష్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన రాధాకిషన్ రావుపై కేసు నమోదు.
సెక్షన్ 120 (బీ), 386,409,506 , రెడ్ విత్ 34, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు.
-
2024-12-03T14:26:59+05:30
బెనిఫిట్ షో ద్వారా వచ్చే నగదు ఎక్కడికి మల్లిస్తున్నారని అడిగిన పిటిషనర్
పూర్తి నివేదిక పరిశీలించి ఆదేశాలు ఇస్తామన్న హైకోర్టు
జీవోలను పరిశీలిస్తామన్న హైకోర్టు
రాత్రి 10 గంటలకు షో వేస్తే మధ్య రాత్రి ఒంటి గంట అవుతుంది
పిల్లలకు నిద్ర అవసరమని అభిప్రాయ పడిన హైకోర్టు
థియేటర్లకు, ఆస్పత్రులకు ప్రభుత్వం భూములు ఇవ్వడంలో ప్రజా ప్రయోజనం ఏముంది ?
కనీసం 25 శాతం ఆదాయం రావాలి.. అలా జరగటం లేదు- హైకోర్టు
ఈ రోజు సాయంత్రం ఆదేశాలు ఇస్తాం: న్యాయస్థానం
-
2024-12-03T14:01:11+05:30
పుష్ప-2 టికెట్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
హైదరాబాద్: పుష్ప-2 మూవీ టికెట్ల ధరలు పెంపుపై హైకోర్టు విచారణ
బెనిఫిట్ షోలకు భారీగా టికెట్ ధరలు పెంపు
సామాన్యులు మూవీ చూసే పరిస్థితి లేదు: పిటిషనర్
చిన్నతనంలో రిలీజ్ రోజే సినిమా చూసిన సందర్భాలు ఉన్నాయి: న్యాయమూర్తి
ఇప్పుడు కుటుంబం మొత్తం సినిమా చూడాలంటే రూ.8 వేలు ఖర్చు చేయాలని అభిప్రాయ పడ్డ జడ్జీ
-
2024-12-03T13:30:22+05:30
సీఎం సమీక్ష
అమరావతి: సీఎం చంద్రబాబు సమీక్ష
మధ్యాహ్నాం 3.30కు రేషన్ కార్డులపై రివ్యూ
హాజరుకానున్న సంబంధిత శాఖ ఉన్నతాధికారులు
-
2024-12-03T13:12:07+05:30
వ్యాపారవేత్త దారుణ హత్య
హైదరాబాద్: హయత్ నగర్‌లో దారుణం
వ్యాపారవేత్త కాశీ రావు హత్య
ఆఫీసులో గొంతుకోసి హత్యచేసిన దుండగులు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.
క్లూస్ టీమ్ ద్వారా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
2024-12-03T13:09:20+05:30
తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు
రెండో ఘాట్‌లోని లింక్ రోడ్డు వద్ద ప్రమాదం
రోడ్డుపై పడటంతో రాకపోకలకు అంతరాయం
బండరాళ్లు, మట్టిని తొలగిస్తోన్న అధికారులు
-
2024-12-03T13:07:29+05:30
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
కరవాల్ బాగ్‌లో ఎగసిపడుతోన్న అగ్నికీలలు
రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది
-
2024-12-03T11:57:09+05:30
మాజీమంత్రి హరీశ్ రావుపై కేసు
హైదరాబాద్: పంజాగుట్ట పీఎస్‌లో మాజీమంత్రి హరీశ్‌పై కేసు
అప్పటి టాస్క్ పోర్స్ డీజీపీ రాధాకిషన్ రావు పై కూడా కేసు
సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో హరీష్ రావు పై కేసు
-
2024-12-03T11:49:20+05:30
ముంతాజ్ హోటల్స్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన
తిరుపతి: అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్స్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన
తిరుపతి తుడా కార్యాలయం వద్ద స్వాముల నిరసన
నిరసనలో పాల్గొన్న శ్రీనివాసానంద స్వామి
ముంతాజ్ అనే ముస్లిం పేరుతో పరమ పవిత్రమైన ఏడు కొండల పక్కన స్టార్ హోటల్స్ నిర్మించటం సరికాదు
ఇది ముమ్మాటికీ హిందువుల మనో భావాలు దెబ్బతియడమే అవుతుంది
ముంతాజ్ హోటల్స్‌కు జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
హిందు మతాన్ని, తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని కుట్ర చేసింది
తుడా అనుమతి లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారు?
అనధికారిక నిర్మాణం జరుగుతున్న పట్టించుకోవడం లేదు.
ముంతాజ్ హోటల్ నిర్మాణ పనులను తుడా అధికారులు ఆపాలి
హోటల్ నిర్మాణానికి సంబంధించిన అనుమతులను వెంటనే రద్దు చేయాలి
అలిపిరి వద్ద అదే స్థలంలో ఆధ్యాత్మిక కేంద్రం, భక్తుల సౌకర్యార్థం విడిది కేంద్రాలను ఏర్పాటు చేయాలి
ఈ దుర్మార్గాన్ని ఆపాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం
-
2024-12-03T11:22:06+05:30
విశాఖలో విషాదం
గాజువాకలో ప్రేమజంట ఆత్మహత్య
అపార్ట్ మెంట్ పై నుంచి దూకి సూసైడ్
-
2024-12-03T11:19:06+05:30
విపక్షాలతో దూరంగా టీఎంసీ, ఎస్పీ
ఢిల్లీ: నేటి విపక్ష కూటమి ఆందోళనకు దూరంగా టీఎంసీ, ఎస్పీ
సంభల్ మతఘర్షణలపై చర్చకు పట్టుబడుతున్న సమాజ్‌వాదీ
నిరుద్యోగం, అధిక ధరలు, మణిపూర్ అల్లర్లు, బెంగాల్ సమస్యలపై చర్చకు టీఎంసీ పట్టు
సంభల్ కంటే అదానీ వ్యవహారం పెద్దది కాదన్న ఎస్పీ నేతలు
పార్లమెంట్ ముఖద్వారం వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొనని ఎస్పీ, టీఎంసీ ఎంపీలు
-
2024-12-03T11:09:20+05:30
లోక్ సభలో గందరగోళం
అదానీ అవినీతిపై చర్చకు విపక్షాల పట్టు
ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య కొనసాగుతోన్న ప్రశ్నోత్తరాలు
-
2024-12-03T10:57:27+05:30
ఏపీ క్యాబినెట్ భేటీ
అమరావతి: ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ.
10 అంశాలతో కేబినెట్ అజెండా.
పలు పాలసీలకు ఆమోదం తెలపనున్న కేబినెట్
ఐటీ అండ్ గ్లోబల్ కేపాసిటీ సెంటర్స్ పాలసీ 4.0పై చర్చ
ఆర్ టీజీని పునర్వ్యవస్థీకరించే అంశంపై వెర్షన్ 4.0 అమలుపై క్యాబినెట్లో నిర్ణయం
ఏపీ టెక్ట్స్ టైల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీపై చర్చ
ఏపీ మారిటైమ్ పాలసీ 4.0పై డిస్కషన్
ఏపీ టూరిజం పాలసీ
స్పోర్ట్స్ పాలసీకు కేబినెట్‌లో ఆమోదం
పొట్టి శ్రీరాములు వర్ధంతి డిసెంబర్ 15వ తేదీని ఆత్మార్పణ దినం రాష్ట్ర ఉత్సవంగా జరిపేందుకు ఆమోదం.
ఆయుర్వేద ,హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్‌లో సవరణల బిల్లుకు ఆమోదం తెలుపనున్న కేబినెట్
41 వ సీ ఆర్ డీ ఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం
-
2024-12-03T10:52:35+05:30
ప్రధాని మోదీకి స్టాలిన్ ఫోన్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధాని మోదీ ఫోన్
ఫెంగల్ తుఫాను పరిస్థితులపై స్టాలిన్‌తో మాట్లాడిన మోదీ
తమిళనాడును ఆదుకునేందుకు కేంద్రం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని హామీ
-
2024-12-03T10:47:03+05:30
పుష్ప-2 టికెట్ రేట్ల పెంపు దుమారం
హైదరాబాద్: పుష్ప-2 సినిమా టికెట్ ధరలు పెంచడంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్.
పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ.
ప్రీమియర్ షో టికెట్ ధరపై 800 వరకు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
డిసెంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య 200, ఆ తర్వాత పెంపునకు అవకాశం
-
2024-12-03T10:07:23+05:30
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.