Share News

AP Elections: వైయస్ జగన్‌పై బ్రదర్ అనిల్ హాట్ కామెంట్స్

ABN , Publish Date - Apr 28 , 2024 | 04:29 PM

వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైయస్ జగన్‌ బావ, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాపాలు చేసే వారిని తొక్కిపడేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

AP Elections: వైయస్ జగన్‌పై బ్రదర్ అనిల్ హాట్ కామెంట్స్

కడప, ఏప్రిల్ 27: వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైయస్ జగన్‌ బావ, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాపాలు చేసే వారిని తొక్కిపడేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆదివారం కడపలోని రాజారెడ్డి విధిలో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వాఖ్యలు చేశారు. పాపులను తరమికొట్టాలంటే ప్రార్థన ఒక్కటే సరిపోదన్నారు. ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం.. ఆ క్రమంలో ఎవరికి భయపడవద్దన్నారు.

ys jagan: టీడీపీలో చేరిన కోడికత్తి శ్రీను

ఆ దేవుడే అండగా ఉన్నాడు. ఆయనపై విశ్వాసం ఉంచి నిర్ణయం తీసుకోండంటూ ప్రజలకు బ్రదర్ అనిల్ సూచించారు. అయితే బ్రదర్ అనిల్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


సీఎం వైయస్ జగన్‌పై ఇప్పటికే వైయస్ షర్మిలతోపాటు వైయస్ వివేకా కుమార్తె వైయస్ సునీత విమర్శలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో అటు వైయస్ జగన్‌కి ఇటు వైయస్ ఇంటి ఆడపడచుల మధ్య మాటల యుద్దం తార స్థాయికి చేరింది.

Loksabha Elections: 35 ఎంపీ స్థానాలు గెలుస్తాం: సంజయ్ రౌత్

అలాంటి వేళ బ్రదర్ అనిల్ కుమార్ సైతం తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం.. అదీ కూడా వైయస్ ఫ్యామిలీకి అడ్డా అయిన కడప గడ్డపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం.. రాజకీయంగా సంచలనంగా మారాయి.


మరోవైపు కడప లోక్‌సభ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైయస్ షర్మిల, వైసీపీ అభ్యర్థిగా వైయస్ అవినాష్ పోటీ చేస్తున్నారు. అయితే వైయస్ వివేకా దారుణ హత్యలో వైయస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని ఇప్పటికే తేటతెల్లమైంది. అలాంటి వేళ అతడిని వైయస్ జగన్ వెనకేసుకు వస్తున్నారంటూ ఇప్పటికే వైయస్ షర్మిల, సునీత ఘాటైన విమర్శలు చేస్తున్నారు.

LokSabha Elections: ప్రజలను భయపెట్టి గెలిచేందుకు మమత ప్రయత్నం

అదే సమయంలో బ్రదర్ అనిల్ కూడా అదే తరహాలో ఘాటైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది. పాపాలు చేసిన వారంటే ఎవరు.. వైయస్ అవినాష్, వైయస్ జగన్‌లేననే ఓ చర్చ సైతం ఉమ్మడి కడప జిల్లాలో జోరందుకొంది.


అదీకాక గత ఎన్నికల వేళ.. అంటే 2019లో వైయస్ జగన్ గెలుపు కోసం బ్రదర్ అనిల్ కుమార్.. రాష్ట్రవ్యాప్తంగా పాస్టర్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలతో వరుస సమావేశాలు నిర్వహించారు. వైయస్ జగన్ గెలిస్తే.. మనందరికి చాలా ఉపయోగకరమంటూ వారికి వివరించారు. కానీ వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. వైయస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్‌లను పక్కన పెట్టేశారు.

ముఖ్యమంత్రి అయిన తర్వాత వైయస్ జగన్ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదంటూ.. గతంలో మీడియా ఎదుటే బ్రదర్ అనిల్ కుమార్‌ వాపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భార్య వైయస్ షర్మిలను కడప లోక్ సభ అభ్యర్థిగా గెలుపించుకొనేందుకు బ్రదర్ అనిల్ రంగంలోకి దిగారని.. అందులోభాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే ఓ ప్రచారం సైతం ఉమ్మడి కడప జిల్లాలో హల్ చల్ చేస్తుంది.

Read National News and Telugu News

Updated Date - Apr 28 , 2024 | 04:33 PM