Buddha Venkanna: వైసీపీ కోవర్టుగా కేశినేని నాని.. చంద్రబాబు గెంటేశాక ఆ పార్టీలోకి..
ABN , Publish Date - Jan 18 , 2024 | 01:16 PM
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ నుంచి ఎంపీగా గెలిచి వైసీపీ కోవర్టుగా పనిచేశారని సంచలన ఆరోపణలు చేశారు. 2017లో టీడీపీలో చేరేందుకు దేవినేని అవినాష్ ప్రయత్నించారని వెంకన్న తెలిపారు. టీడీపీలో చేరొద్దని కేశినేని నాని చెప్పారని తర్వాత తెలిసిందని తెలిపారు.
విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని నానిపై (Kesineni Nani) తెలుగుదేశం పార్టీ (TDP) నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ నుంచి ఎంపీగా గెలిచి వైసీపీ కోవర్టుగా పనిచేశాడని సంచలన ఆరోపణలు చేశారు. 2017లో టీడీపీలో చేరేందుకు దేవినేని అవినాష్ (Devineni Avinash) ప్రయత్నించారని బుద్దా వెంకన్న తెలిపారు. టీడీపీలో చేరొద్దని కేశినేని నాని చెప్పారని తర్వాత తమకు తెలిసిందని తెలిపారు. అప్పటినుంచి వైసీపీ కోవర్టుగా కేశినేని నాని పనిచేస్తున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు.
కేశినేని నానిపై బుద్దా వెంకన్న అవినీతి ఆరోపణలు చేశారు. కేశినేని నాని పచ్చి మోసగాడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీలో అవినీతికి పాల్పడింది ఎవరో తెలియ జేయాలని కోరారు. పేరు చెప్పే ధైర్యం లేకుంటే మాట్లాడొద్దని సూచించారు.
కేశినేని ఓ పార్టీలో స్థిరంగా ఉండరని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి బయటకు గెంటేశారని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మెడ పట్టుకుని బయటకు గెంటేశారని వివరించారు. వైసీపీలో చేరిన తర్వాత జగన్ తన్ని తరిమేయడం ఖాయం అని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని ఓడిపోతారని బుద్దా వెంకన్న అంటున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.