EX- MLA Madhusudan Reddy :అధికారులపై శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బూతుపురాణం
ABN , Publish Date - Dec 16 , 2024 | 06:06 AM
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది.
బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై కేసు నమోదు
శ్రీకాళహస్తి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. స్వర్ణముఖినది కరకట్టపై శనివారం నిర్మాణాలు తొలగించే పనులు చేపట్టారు. ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి మధుసూదన్‌రెడ్డి అక్కడికి చేరుకుని ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎలా నిర్మాణాలు తొలగిస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతు పదజాలంతో.. పత్రికల్లో రాయలేని భాషతో విరుచుకుపడ్డారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కూడా అయింది. తమను అసభ్య పదజాలంతో దూషించారంటూ టౌన్ ప్లానింగ్ అధికారి శారద ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.