Share News

Central Minister K Rammohan Naidu: విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

ABN , Publish Date - Dec 23 , 2024 | 06:42 PM

ఎన్డీయే ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన అనంతరం రైల్వే జోన్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 50 ఎకరాల స్థలాన్ని సైతం ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత రైల్వే జోన్ కార్యరూపం దాలుస్తుందన్నారు.

Central Minister K Rammohan Naidu: విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

విశాఖపట్నం, డిసెంబర్ 23: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కష్టాల నుంచి గట్టు ఎక్కించేందుకు కేంద్ర ఉక్క శాఖ మంత్రి కుమారస్వామి ఆలోచిస్తున్నారని పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం సానుకూల ఆలోచనతో ఉందన్నారు. అభద్రతా భావం వద్దంటూ కార్మికులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు, వారి ఆలోచనలకు అనుగుణంగానే కేంద్రం చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

Also Read: లుంగీ కట్టుకొని బెడ్ రూమ్ లో కూర్చో..ఎమ్మెల్యే మాధవి ప్రెస్ మీట్

Also Read : రాతి ఉసిరికాయలు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

సోమవారం విశాఖపట్నంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. దేశం కోసం ఎక్కడికైనా వెళ్లి పని చేయడానికి ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు సిద్ధంగా ఉండటం హర్షించదగ్గ విషయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతను ప్రోత్సహిస్తూ యువశక్తిని ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. రోజ్ గారి మేళాల ద్వారా 13 సార్లు.. 7 లక్షల79 వేల మందికి ఉపాధి కల్పించామన్నారు.

Also Read: సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్లదు.. పుష్పా నిర్మాతతో కలిసి కోమటిరెడ్డి క్లారిటీ

Also Read : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఘరానా మోసం..


ఎన్డీయే ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన అనంతరం రైల్వే జోన్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 50 ఎకరాల స్థలాన్ని సైతం ఇవ్వ లేక పోయిందని మండిపడ్డారు.

Also Read: పుష్ప సినిమాపై సీతక్క హాట్ కామెంట్స్

Also Read: Yearender 2024: ఢిల్లీ మద్యం కుంభకోణం.. రాజకీయ ప్రకంపనలు


కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత రైల్వే జోన్ కార్యరూపం దాలుస్తుందన్నారు. ఇక జూన్ 26వ తేదీ నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తవుతోందని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాసటగా నిలుస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్ కృషితో టీసీఎస్, లూలు తదితర కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు.

For Andhrapradesh News And Telugu News

Updated Date - Dec 23 , 2024 | 06:53 PM