Home » Ram Mohan
విమానాశ్రయాలను నిర్మించేది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూ సేకరణ మాత్రమే చేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు చెప్పారు.
‘రాష్ట్రం డ్రోన్ల హబ్‌గా మారనుంది. అందుకు సీఎం చంద్రబాబు సుముఖంగా ఉన్నారు’ అని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన అనంతరం రైల్వే జోన్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 50 ఎకరాల స్థలాన్ని సైతం ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత రైల్వే జోన్ కార్యరూపం దాలుస్తుందన్నారు.
రాజమండ్రి ఎయిర్ పోర్టు నూతన టెర్మినల్‌ను త్వరితగతిన పూర్తి చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. ఏపీలో అన్ని ఎయిర్ పోర్టుల నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పటివరకు ఏటీఆర్ విమాన సర్వీసులు మాత్రమే ఉండగా ఇప్పుడు ఎయిర్ బస్‌లు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.
కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకి లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా ముందు వరుసను కేటాయించారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను ప్రతీ నెలా పరిశీలిస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు అత్యంత ప్రాధ్యాన ఇస్తోందని వివరించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) కీలక ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదని స్పష్టం చేశారు.
మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన 365 యాప్స్ సేవల్లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలీకాం, మీడియా సహా అనేక రంగాలపై దాని ప్రభావం పడింది. ఆ క్రమంలో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో సేవలు నిలిచిపోయాయి. ఈ సేవలు నిలిచిపోవడంతో కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు (Minister Rammohan Naidu) స్పందించారు.
పార్లమెంట్ కొత్త భవనంలో 18వ లోక్‌సభ కొలువుదీరింది. ఈ భవనంలో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరగడం ఇదే తొలిసారి. తొలుత ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.