Chandrababu: పసుమర్రు రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
ABN , Publish Date - May 15 , 2024 | 10:15 AM
పల్నాడు జిల్లా పసుమర్రు రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు-టిప్పర్ ఢీ కొని చిన్నగంజాంకు చెందిన ఆరుగురు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
అమరావతి: పల్నాడు జిల్లా పసుమర్రు రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు-టిప్పర్ ఢీ కొని చిన్నగంజాంకు చెందిన ఆరుగురు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
AP News: పాత కేసులతో టీడీపీ నేతల అరెస్ట్
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. చీరాల (Cheerala) నుంచి హైదరాబాద్ (Hyderabad) వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు (Private Travel Bus) అదుపుతప్పి టిప్పర్ లారీ (Tipper lorry)ని ఢీ కొంది. ఢీకొట్టిన వెంటనే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు డ్రైవర్ సహా ఆరుగురు సజీవ దహనమయ్యారు. బస్సు క్లీనర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
AP News: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం.. వేట కొడవళ్లతో విచక్షణారహితంగా..
AP Elections 2024: ఏపీలో చెలరేగిన వైసీపీ మూకలు
Read Latest AP News And Telugu News