Share News

Chandrababu's Govt : ఏపీకి దశ.. దిశ

ABN , Publish Date - Oct 12 , 2024 | 03:47 AM

కూటమి ప్రభుత్వం జోరు పెంచింది. విధ్వంస పాలనను చూసిన రాష్ట్రానికి కొత్త విజన్‌ను అందించేందుకు ప్రణాళిక సిద్దమైంది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను అందించే లక్ష్యంతో రూపొందిస్తున్న పాలసీలకు చంద్రబాబు ప్రభుత్వంతుది మెరుగులు దిద్దుతోంది. ఈ పాలసీలు త్వరలోనే కేబినెట్‌ ముందుకు రానున్నాయి.

Chandrababu's Govt : ఏపీకి దశ.. దిశ

  • విధ్వంసపాలన చూసిన రాష్ట్రానికి కొత్త విజన్‌

  • ఈ నెలాఖరుకల్లా 22 కొత్త పాలసీలు

  • దీనిపై అన్ని శాఖలకు సీఎస్‌ ఉత్తర్వులు

  • ఆ పాలసీలు కేబినెట్‌కు చేరేలా చకచకా చర్యలు

  • ఆర్థికేతర నిర్ణయాలు వెంటనే అమలు చేయండి

  • ఈ కేటగిరీలో దాదాపుగా 49 అంశాలు

అమరావతి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం జోరు పెంచింది. విధ్వంస పాలనను చూసిన రాష్ట్రానికి కొత్త విజన్‌ను అందించేందుకు ప్రణాళిక సిద్దమైంది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను అందించే లక్ష్యంతో రూపొందిస్తున్న పాలసీలకు చంద్రబాబు ప్రభుత్వంతుది మెరుగులు దిద్దుతోంది. ఈ పాలసీలు త్వరలోనే కేబినెట్‌ ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో 22 ప్రభుత్వ పాలసీలను అక్టోబరు 30లోగా కేబినెట్‌కి సమర్పించాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశిస్తూ సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ శుక్రవారం సర్క్యులర్‌ జారీ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో డబ్బులు అవసరం లేని ప్రతిపాదనలను తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. ఆర్థికేతర విభాగంలో ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు, కొత్త పాలసీల జాబితాను ఆ సర్క్యులర్‌కి జత చేశారు. ఇందులో కొన్ని నిర్ణయాలను వంద రోజుల వ్యవధిలోనే అమలు చేశారని చెప్పారు. ఇందులో మిగిలిన ఆర్థికేతర నిర్ణయాలను తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు.

దీనికి సంబంధించి కేబినెట్‌ అనుమతి కావాల్సిన ప్రతిపాదనలను వచ్చేవారం జరగబోయే కేబినెట్‌ ముందుకు తీసుకురావాలని, కేబినెట్‌ అనుమతి అవసరం లేని ప్రతిపాదనలకు శాఖపరంగా ఆదేశాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇలాంటి ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆ సమాచారాన్ని జీఏడీకి తెలియజేయాలని సూచించారు. దానివల్ల ఆర్థికేతర నిర్ణయాల అమలు తీరుతెన్నులపై జీఏడీ ఆ సమాచారాన్ని కేబినెట్‌కి అందుబాటులో ఉంచగలుగుతుందని పేర్కొన్నారు.


ఆర్థికేతర నిర్ణయాల్లో స్వర్ణకారుల కోసం కార్పొరేషన్‌, వెనుకబడిన వర్గాల రక్షణ చట్టం, స్థానికసంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ ప్రతిపాదనను కేంద్రానికి పంపడం, కాపుభవనాల నిర్మాణం, మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్‌, డ్రగ్స్‌, గంజాయి కట్టడికి చర్యలు, తోట చంద్రయ్య లాంటి అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు, 2019-24 మధ్య జరిగిన విధ్వంసంపై చట్టపరమైన చర్యలు, నూర్‌బాషా కార్పొరేషన్‌ ఏర్పాటు, క్రిస్టియన్‌ మెషినరీల ఆస్తుల అభివృద్ధికి బోర్డు, అర్హత ఉన్న ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజాలుగా నియమించడం, నిర్మాణ, భవన రంగ కార్మికుల బోర్డును తిరిగి ఏర్పాటుచేయడం లాంటి దాదాపు 49 నిర్ణయాలను సీఎస్‌ తన సర్క్యులర్‌లో ప్రస్తావించారు. వీటన్నింటినీ తక్షణమే అమలు చేసి, ఆ సమాచారాన్ని జీఏడీకి అందజేయడం ద్వారా కేబినెట్‌ దృష్టికి తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు.

  • ప్రతిపాదిత పాలసీలు ఇవే..

1) ఎనర్జీ పాలసీ

2) ఉన్నత విద్యా పాలసీ

3) బ్లూ ఓషన్‌ ఎకానమీ పాలసీ

4) మారిటైమ్‌ పాలసీ

5) టెక్ట్స్‌టైల్‌ పాలసీ

6) పారిశ్రామిక పాలసీ - ఫార్చ్యూన్‌ 500 కంపెనీలు

7) ఇండస్ర్టియల్‌ పార్క్స్‌

8)ఫుడ్‌ ప్రాసెసింగ్‌

9) ఎంఎ్‌సఎంఈ, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ పాలసీ

10) లాజిస్టిక్స్‌ పాలసీ 11) సెమీకండక్టర్‌ , డిస్‌ప్లే ఫ్యాబ్‌ పాలసీ

12) స్టార్టప్‌ పాలసీ

13) హార్డ్‌వేర్‌ అండ్‌ ఎలక్ర్టానిక్స్‌ పాలసీ

14) ఐటీ

15) ఆర్‌ అండ్‌ డీ, డీప్‌ టెక్‌ పాలసీ

16) పీ4, హెచ్‌ఎన్‌ఐ పాలసీ

17) రోడ్ల(పీపీపీ) పాలసీ

18) వాటర్‌ 19) టూరిజం

20) యూత్‌ పాలసీ

21) స్పోర్ట్స్‌ 22) ఈ-స్పోర్ట్స్‌ పాలసీ.

Updated Date - Oct 12 , 2024 | 03:47 AM