Share News

Nellore : పెంచలకోనలో చిరుత సంచారం

ABN , Publish Date - Nov 29 , 2024 | 05:32 AM

నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన అటవీ పార్కు సమీపంలో బుధవారం రాత్రి చిరుత పులి సంచరించింది.

Nellore : పెంచలకోనలో చిరుత సంచారం

రాపూరు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన అటవీ పార్కు సమీపంలో బుధవారం రాత్రి చిరుత పులి సంచరించింది. కారులోని భక్తులు చిరుత సంచారాన్ని తమ మొబైల్‌లో చిత్రీకరించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ వీడియోలు వైరల్‌ కావడంతో కోనకు వచ్చే భక్తుల్లో భయాందోళన నెలకొంది. దీనిపై డీఎ్‌ఫవో మహబూబ్‌బాషా మాట్లాడుతూ అటవీశాఖ పార్కు సమీపంలో చిరుత భక్తులకు ఎదురుపడిందని, కారు హారన్‌ కొట్టడంతో అడవిలోకి వెళ్లిపోయిందన్నారు. వెంటనే అటవీ, బేస్‌ క్యాంపు, రెగ్యులర్‌ సిబ్బందిని అప్రమత్తం చేసి అటవీ పరిసరాలన్నీ పరిశీలించినట్లు తెలిపారు.

Updated Date - Nov 29 , 2024 | 05:32 AM