Share News

Chandrababu:12న తిరుమలకు రానున్న చంద్రబాబు..

ABN , Publish Date - Jun 10 , 2024 | 10:57 AM

అమరావతి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లనున్నారు. బుధవారం (12వ తేదీ) చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేస్తారు. అదే రోజు రాత్రికి ఆయన తిరుమలకు బయలుదేరతారు.

Chandrababu:12న తిరుమలకు రానున్న చంద్రబాబు..

అమరావతి: తెలుగుదేశం అధినేత (TDP Chief) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రిగా (Chief Minister) ప్రమాణస్వీకారం (Swearing) చేసిన అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమల (Tirumala)కు వెళ్లనున్నారు. బుధవారం (12వ తేదీ) చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేస్తారు. అదే రోజు రాత్రికి ఆయన తిరుమలకు బయలుదేరతారు. ఆ రాత్రి తిరుమలలో బస చేసి.. 13వ తేదీ (గురువారం) ఉదయం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు.


కాగా టీడీపీ కూటమి పక్షాలు మంగళవారం సమావేశం కానున్నాయి. ఈ భేటీలో కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) పక్షాలు చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుని తీర్మానం చేయనున్నారు. అనంతరం తీర్మానం ప్రతిని కూటమి ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసి అందజేయనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కోరనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. బుధవారం (12వ తేదీ) ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.


మరోవైపు చంద్రబాబు ప్రమాణాస్వీకారం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్‌ ప్రక్కన జరిగే పనులను టీడీపీ నేతలు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జర్మన్‌ హ్యాంగర్స్‌తో భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్జేజీని సిద్ధం చేస్తున్నారు. స్టేజీ పనులను తిరుపతి జేసీ ధ్యాన్‌చందర్‌, వైజాగ్‌ వీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ పర్యవేక్షిస్తున్నారు. 800 అడుగుల పొడవు, 420 వెడల్పు గల జర్మన్‌ హ్యాంగర్స్‌తో భారీ టెంట్‌ను వేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలులో భారీ వర్షం.. లోతట్టు కాలనీలు జలమయం

హీరోలుగా ఉన్న ఆ నేతలు ఇప్పుడు జీరోలు..

కేబినెట్‌ బెర్త్‌లపై ఆ ఎమ్మెల్యేల ఆశలు..

ఆ జిల్లాలో వైసీపీ ఓటమికి కారణాలు ఇవే..

శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు

బరిలోకి బాబు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 10 , 2024 | 11:01 AM