Share News

Tirupati: విచారణకు సహకరించని మోహిత్ రెడ్డి

ABN , Publish Date - Jul 28 , 2024 | 09:57 AM

తిరుపతి: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు, మొన్నటి ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థి, తుడా మాజీ చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి శనివారం రాత్రి బెంగళూరులో అరెస్టయిన విషయం తెలిసిందే. దీంతో తిరుపతి పోలీసులు ఎస్‌వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. పులివర్తి నానిపై దాడి కేసులో విచారణకు పిలిచినా మోహిత్ రెడ్డి సహకరించడం లేదు.

Tirupati: విచారణకు సహకరించని మోహిత్ రెడ్డి

తిరుపతి: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి (Chevireddy Bhaskar Reddy) కుమారుడు, మొన్నటి ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థి, తుడా మాజీ చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి (Chevireddy Mohit Reddy) శనివారం రాత్రి బెంగళూరు (Bangalore)లో అరెస్టయిన (Arrest) అయిన విషయం తెలిసిందే. దీంతో తిరుపతి పోలీసులు ఎస్‌వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. పులివర్తి నానిపై దాడి కేసులో విచారణకు పిలిచినా మోహిత్ రెడ్డి సహకరించడం లేదు.. విచారణకు రాకుండా విదేశాలకు పోతున్న నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


పులివర్తి నానిపై హత్యాయత్నం కేసు విషయంలో ఎస్‌వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో మోహిత్ రెడ్డిని పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణ పూర్తయ్యే వరకు విదేశాలకు వెళ్ళకూడదని నిబంధన విధించారు. ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలని మోహిత్ రెడ్డికి పోలీసులు తెలిపారు. 41 నోటీసు ఇచ్చి మోహిత్ రెడ్డిని విడుదల చేశారు.


కాగా వైసీపీ ప్రభుత్వంలో జగన్ దిష్టిబొమ్మలు కాల్చినా హత్యాయత్నం కేసులు పెట్టేవారని, వైసీపీ ఒత్తిడితో అప్పట్లో దిష్టిబొమ్మలు కాల్చినా టీడీపీ నేతలను పోలీసులు జైలుకు పంపేవారు. అయితే దాడికి సాక్షాలు ఉన్న.. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడకుండా 41 నోటీసీ ఇచ్చి పంపేలా టీడీపీ ప్రభుత్వంలో పోలీసు చర్యలు తీసుకున్నారు. మోహిత్ రెడ్డి విషయంలో టీడీపీ వైఖరికి సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.


అయితే మోహిత్ రెడ్డికి 41 నోటీస్ ఇచ్చి పంపినా ఇంకా స్టేషన్ బయటే ఉన్నారు. ఎక్కువ సమయం స్టేషన్లో పెట్టినట్టు ప్రచారం పొందేందుకు యత్నిస్తున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ నుంచి మీడియా దగ్గరికి పోలీసు ఉన్నతాధికారులు వచ్చారు. టీడీపీ కక్ష సాధింపులకు పాల్పడకపోయినా, ఆ పార్టీపై ముద్ర వేయాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూస్తున్నారని తెలిపారు. పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడడంతో మోహిత్ రెడ్డి స్టేషన్ నుంచి బయటకు వచ్చారు.


కాగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు, మొన్నటి ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థి, తుడా మాజీ చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అరెస్టయ్యారు. తండ్రి భాస్కరరెడ్డి, తమ్ముడు హర్షిత్‌తో కలసి దుబాయ్‌ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా శనివారం రాత్రి బెంగళూరు దేవనహళ్లి ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో మోహిత్‌రెడ్డి నిందితుడిగా ఉన్న నేపథ్యంలో మోహిత్‌పై ఆంధ్ర సిట్‌ పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. బోర్డింగ్‌ పాస్‌ చెక్‌ చేసే సమయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. ఆయనతో పాటు దుబాయ్‌ వెళ్లాల్సిన భాస్కర రెడ్డి, హర్షిత్‌రెడ్డి కూడా ప్రయాణం విరమించుకుని మోహిత్‌ వెంటే ఉన్నారు. అధికారులతో భాస్కరరెడ్డి వాదనకు దిగడంతో తండ్రీకొడుకులు ముగ్గురినీ విమానాశ్రయంలోనే నిర్బంధించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి నేడు కల్వకుర్తి పర్యటన..

భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

జగన్‌ ధ్వంస రచన.. అబద్ధాలే ఆలంబన!

పదేళ్లలో ఏపీ అగ్రగామి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 28 , 2024 | 09:57 AM