Narayana: ఎస్మా ప్రయోగిస్తే ఇందిరాగాంధీకి పట్టినగతే జగన్‌కూ పడుతుంది
ABN , Publish Date - Jan 08 , 2024 | 11:57 AM
Andhrapradesh: అంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని సీపీఐ నేత నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్మా ప్రయోగిస్తే ఇందిరాగాంధీకి పట్టినగతే జగన్‌కు పడుతుందని హెచ్చరించారు.
తిరుపతి, జనవరి 8: అంగన్వాడీల సమ్మెపై (Anganwadi Strike) ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని సీపీఐ నేత నారాయణ (CPI Leader Narayana) తీవ్రంగా తప్పుబట్టారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్మా ప్రయోగిస్తే ఇందిరాగాంధీకి (Indira Gandhi) పట్టినగతే జగన్‌కు పడుతుందని హెచ్చరించారు. సోమవారం జోరు వానలోనూ అంగన్వాడీల నిరసన కొనసాగుతుండగా... అంగన్వాడీలకు నారాయణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశద్రోహులపైన ఎస్మా ప్రయోగించాలన్నారు. సీఎంపైన, ఎర్రచందనం స్మగ్లర్లపైన ఎస్మా చట్టం ప్రయోగించాలని వ్యాఖ్యలు చేశారు.
ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ఎస్మా ప్రయోగించారని.. రాజకీయంగా ఆమె పతనమయ్యారన్నారు. జగన్ అమ్మ లాంటి అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తే ఆ పాపం ఊరికే పోదని.. అదే అతని నాశనానికి కారణం అవుతుందని హెచ్చరించారు. ఎస్మా చట్టం అమలు చేసి ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేయండన్నారు. ‘‘మీ జైళ్లు సరిపోవు. మీరు అందరికి అన్నం పెట్టలేరు’’ అని వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీల పోరాటం కొనసాగుతుందని.. వారికి మద్దతుగా తాము నిలబడతామని నారాయణ స్పష్టం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...