Share News

AP News: అధికారులకు తలనొప్పిగా మారుతున్న వాలంటీర్ల తొలగింపు

ABN , Publish Date - Mar 20 , 2024 | 08:36 AM

చిత్తూరు జిల్లా: వాలంటీర్ల తొలగింపు వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారుతోంది. చిత్తూరు జిల్లాలో తాజాగా మరో ఇద్దరు వాలంటీర్లను జిల్లా యంత్రాంగం తొలగించింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 35 మంది వాలంటీర్ల తొలగించారు.

AP News:  అధికారులకు తలనొప్పిగా మారుతున్న వాలంటీర్ల తొలగింపు

చిత్తూరు జిల్లా: వాలంటీర్ల (Volunteers) తొలగింపు వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారుతోంది. చిత్తూరు జిల్లా (Chittoor Dist.)లో తాజాగా మరో ఇద్దరు వాలంటీర్లను జిల్లా యంత్రాంగం తొలగించింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 35 మంది వాలంటీర్లను తొలగించారు. చిత్తూరు కార్పొరేషన్‌లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండలంలో ముగ్గురు, పులిచెర్ల మండలంలో ఇద్దరు వాలంటీర్లను జిల్లా యంత్రాంగం తొలగించింది. అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై వాలంటీర్లు తొలగించారు.

ఇంకను జిల్లా వ్యాప్తంగా 163 మంది వాలంటీర్లు ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో అధికార వైసీపీకి అనుకూలంగా పాల్గొంటున్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించినట్లు సమాచారం. దీంతో మరి కొంతమందిపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఫిర్యాదులు వస్తున్న వారిని ఉంచితే ప్రచారంలో జోరులో తగ్గని పరిస్థితి.. తొలగిస్తే నేరుగానే ప్రచారం చేస్తారు.. ఇది ప్రమాదకరంగా మారుతోందని జిల్లా యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. తొలగించిన వాలంటీర్లు వైసీపీ అధికారంలోకి వస్తే.. మళ్లీ వాలంటీర్లుగా నియమింపబడతారు అన్న ధీమా వారిలో నెలకొంది.

Updated Date - Mar 20 , 2024 | 11:25 AM