Chintamohan: గోవిందరాజు స్వామి సత్రాల కూల్చివేత నిర్ణయం తగదు
ABN , Publish Date - Jan 05 , 2024 | 04:53 PM
Andhrapradesh: గోవిందరాజు స్వామి సత్రాలు కూల్చివేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించడం తగదని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. శుక్రవారం గోవిందరాజు స్వామి సత్రాల కూల్చివేతను చింతామోహన్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రూ.600 కోట్లు వెచ్చించి అతిథి గృహాల నిర్మాణం చేయాలనే ప్రతిపాదన వెనక కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపించారు.
తిరుపతి, జనవరి 5: గోవిందరాజు స్వామి సత్రాలు కూల్చివేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించడం తగదని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ (Former Central Minister Chinta Mohan) అన్నారు. శుక్రవారం గోవిందరాజు స్వామి సత్రాల కూల్చివేతను చింతామోహన్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రూ.600 కోట్లు వెచ్చించి అతిథి గృహాల నిర్మాణం చేయాలనే ప్రతిపాదన వెనక కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపించారు.
వైసీపీలోని కీలక వ్యక్తికి రూ.50 కోట్లు ముట్టినట్టు తనకు సమాచారం ఉందన్నారు. కొన్ని కోర్టులు కూడా అవినీతిమయం అయిన నేపథ్యంలో గోవిందరాజస్వామి సత్రాల కూల్చివేత వెనుక ఉన్న అవినీతిని తిరుపతిలో వీధి వీధికి తీసుకుపోతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చింతామోహన్ స్పష్టం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...