Share News

Nara Lokesh: చిత్తూరు జిల్లాకు మంత్రి నారా లోకేశ్.. ఎందుకంటే?

ABN , Publish Date - Sep 19 , 2024 | 08:23 AM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనకు100 రోజులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మంత్రులు అంతా ఎవరి బాధ్యతులు వారు చురుగ్గా నిర్వర్తిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేశ్ నేడు(గురువారం), రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.

Nara Lokesh: చిత్తూరు జిల్లాకు మంత్రి నారా లోకేశ్.. ఎందుకంటే?
Nara Lokesh

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనకు100 రోజులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మంత్రులు అంతా ఎవరి బాధ్యతులు వారు చురుగ్గా నిర్వర్తిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేశ్ నేడు(గురువారం), రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.


ఇవాళ రాత్రి 8.30 నిమిషాలకు మండల కేంద్రం బంగారు పాలానికి చేరుకొని రాత్రికి మంత్రి లోకేశ్ అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం 10-11 గంటల మధ్యలో బంగారుపాలెం ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి 2 గంటలకు బంగారుపాలెం నుంచి రోడ్డు మార్గం గుండా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడకు వెళ్తారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. కాగా నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సందర్భంగా వంద కిలోమీటర్ల మైలురాయి సందర్భంగా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మాట ప్రకారం ప్రారంభోత్సవానికి మంత్రి సిద్ధమయ్యారు.


రాష్ట్రంలో పలు చోట్ల అన్నా క్యాంటీన్ల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ పలుచోట్ల అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అలాగే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లను సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించనున్నారు. రాత్రి 7 గంటలకు కేజీహెచ్ వద్ద,7.30 గంటలకు టర్నల్ చౌట్రీ వద్ద, 8 గంటలకు జనతా బజార్ (ప్రూట్ మార్కెట్) వద్ద మొదలుపెట్టనున్నారు. మరోవైపు ప్రొద్దుటూరు, కడపలలో కూడా ఈ రోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి.

Updated Date - Sep 19 , 2024 | 08:23 AM