Share News

Apologize: క్షమాపణలు చెబుతూ ప్రియాంక జైన్, శివ్ కుమార్‌ వీడియో విడుదల..

ABN , Publish Date - Dec 03 , 2024 | 02:01 PM

తిరుమల.. బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్, శివ్ కుమార్‌లు శ్రీవారి భక్తులకు, టీటీడీకి క్షమాపణలు చెప్తూ మంగళవారం వీడియో విడుదల చేశారు. కేవలం వినోదం కోసమే ఆ వీడియో చేశామని, తిరుమల పవిత్రతను దెబ్బ తీయాలనో.. లేక భక్తుల మనోభావాలు కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని.. తెలియక చేసిన తప్పును మీరందరూ క్షమించాలని కోరుతున్నామని.. పేర్కొంటూ ప్రియాంక, శివ కుమార్ వీడియో విడుదల చేశారు.

Apologize: క్షమాపణలు చెబుతూ ప్రియాంక జైన్, శివ్ కుమార్‌ వీడియో విడుదల..

తిరుమల.. బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ (Bigg Boss fame Priyanka Jain), శివ్ కుమార్‌ (Shiv Kumar)లు శ్రీవారి భక్తులకు (Devotees), టీటీడీ (TTD) కి క్షమాపణలు (Apologize) చెప్తూ మంగళవారం వీడియో విడుదల చేశారు (Video Release). తాము తిరుమల వచ్చినప్పుడు సరదా కోసం చేసిన వీడియో ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఊహించలేదని.. కేవలం వినోదం కోసమే ఆ వీడియో చేశామని అన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బ తీయాలనో.. లేక భక్తుల మనోభావాలు కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని.. తెలియక చేసిన తప్పును మీరందరూ క్షమించాలని కోరుతున్నామని.. పేర్కొంటూ ప్రియాంక, శివ కుమార్ వీడియో విడుదల చేశారు.


కాగా బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ వివాదంలో చిక్కుకున్నారు. గత నెల నవంబర్ 27న తన స్నేహితుడు శివకుమార్‌తో కలిసి తిరుమల నడక మార్గంలో చేసిన ప్రాంక్ వీడియో ఆమెను చిక్కుల్లో పడేసింది. కొద్ది రోజుల క్రితం అలిపిరి మెట్ల మార్గంలో చిరుత ఎటాక్ చేసిందంటూ రీల్‌ను ప్రియాంక అప్ లోడ్ చేశారు. చివరికి చిరుత లేదు.. అది ప్రాంక్ వీడియో అని తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. తిరుమల పవిత్రతను దెబ్బ తీసిన ప్రియాంకపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు.


తన స్నేహితుడు శివకుమార్‌తో కలసి గత నెల తిరుమలకు వచ్చిన ప్రియాంక.. అలిపిరి మెట్ల మార్గంలో తమను చిరుత వెంటాడిందంటూ రీల్స్ తీశారు. అనిమేషన్, మ్యూజిక్‌తో కూడిన రీల్స్‌ను ప్రియాంక అప్లోడ్ చేశారు. అది సోషియల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీవారి భక్తులు.. ప్రియాంక, శివకుమార్ పై మండిపడుతున్నారు. తిరుమలలో ప్రాంక్ వీడియోల పేరుతో ఇదేం పని అంటూ విమర్శలు చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బ తీస్తూ ప్రాంక్ వీడియోలు చేసే వారీపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై స్పండించిన టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వారిపై కేసులు పెట్టేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. దీంతో దిగొచ్చిన ప్రియాంక జైన్ ఆమె ప్రియుడు శివ్ కుమార్‌లు క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు.

Updated Date - Dec 03 , 2024 | 02:01 PM