AP News: జరగనిది జరిగినట్టు ‘సాక్షి’ కనికట్టు.. ఛీకొట్టిన ఓ బాలిక తండ్రి
ABN , Publish Date - Nov 05 , 2024 | 01:15 PM
మైనర్ బాలికపై అత్యాచారం జరగకపోయినా జరిగినట్టు సాక్షిలో తప్పుడు కథనం ప్రచురితమైంది. తిరుపతి జిల్లాలోని ఎర్రవారి పాలెంలో ఘటన జరిగినట్టుగా మెయిస్ పేజీలో వార్త ఇచ్చింది. అయితే ఈ వార్తను చూసి సదరు బాలిక తండ్రి షాక్‌కు గురయ్యాడు.
తిరుపతి: జరగకపోయినా జరిగినట్టుగా కనికట్టు చేయడం.. మసిపూసి మారేడుకాయ చేయడం ఏపీ మాజీ సీఎం జగన్ సొంత మీడియా సంస్థ ‘సాక్షి’కి అలవాటు!. కాదు కాదు పనే అది!. ఆ సంస్థ టీవీ ఛానల్, పేపర్‌లో వచ్చే వార్తలు, కథనాలను గమనించే ఎవరికైనా ఈ భావన కలగక మానదు. రోత రాతలు ఆ విధంగా ఉంటాయి మరి. జనాలు ఎంత ఛీ కొడుతున్నా, ఛీత్కరిస్తున్నా రాతల్లో మార్పు ఉండబోదని నిరూపిస్తూ ‘సాక్షి’ దిన పత్రికలో మరో దారుణాతి దారుణమైన ఫేక్ న్యూస్ వచ్చింది.
తిరుపతి జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం జరగకపోయినా జరిగినట్టు సాక్షిలో తప్పుడు కథనం ప్రచురితమైంది. తిరుపతి జిల్లాలోని ఎర్రవారి పాలెంలో ఘటన జరిగినట్టుగా మెయిస్ పేజీలో వార్త ఇచ్చింది. అయితే ఈ వార్తను చూసి సదరు బాలిక తండ్రి షాక్‌కు గురయ్యాడు. వెంటనే స్పందించి అత్యాచారం జరగలేదని ఖండించాడు. తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ బాలిక చికిత్స తీసుకుంటుండగా అక్కడికి వచ్చిన వైసీపీ నాయకుల తీరుపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అత్యాచారం జరగలేదు..
సాక్షి పేపర్‌లో తప్పుడు వార్త ప్రచురితం కావడంపై బాలిక తండ్రి విస్మయం వ్యక్తం చేశారు. ‘‘ నా కుమార్తెపై ఎలాంటి అత్యాచారం జరగలేదు. గతంలో ప్రేమ పేరుతో కొందరు వేధించారు. వారు నిన్న (సోమవారం) వెంటబడి దాడి చేయాలని ప్రయత్నించారు. సమయానికి కొంతమంది రక్షించారు. అయితే ఈ విషయాన్ని కొంతమంది స్వప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు అందరూ అండగా ఉన్నారు. పోలీసులు, ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించారు’’ అని బాలిక తండ్రి వెల్లడించారు.
కాగా నిన్న జరిగిన దాడిలో గాయపడ్డ బాలిక ప్రస్తుతం మెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలికను ఇప్పటికే తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు పరామర్శించారు. ఈ ఘటనపై ఆయన ఇవాళ (మంగళవారం) ప్రకటన కూడా చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
హోంమంత్రి అనితపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన డీజీపీ ద్వారక తిరుమలరావు
ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య కేసు.. హైకోర్టులో వైసీపీ నేతకు షాక్
For more AP News and Telugu News