AP News: తిరుపతి జిల్లా, పీలేరులో ఉద్రిక్తత..
ABN , Publish Date - Jul 01 , 2024 | 02:00 PM
తిరుపతి జిల్లా, పీలేరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించేసారు. అయితే వైసీపీ అల్లరి మూకలే బ్యానర్లను చించి ఉంటారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బ్యానర్లు చించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
![AP News: తిరుపతి జిల్లా, పీలేరులో ఉద్రిక్తత..](https://media.andhrajyothy.com/media/2024/20240625/tirupati_0c877a7347_v_jpg.webp)
తిరుపతి జిల్లా: పీలేరు (Peeleru)లో ఉద్రిక్తత (Tension) వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (MLA Nallari Kishore Kumar Reddy) పర్యటన (Visit) సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లను (Banners) గుర్తు తెలియని వ్యక్తులు చించేసారు. అయితే వైసీపీ (YCP) అల్లరి మూకలే బ్యానర్లను చించి ఉంటారని టీడీపీ నేతలు (TDP Leaders) ఆరోపిస్తున్నారు. బ్యానర్లు చించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా పీలేరు నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నాయకులు, కార్యకర్తలకు హామీ ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం తన స్వగ్రామం నగిరిపల్లెకు ఎమ్మెల్యే రావడంతో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు నల్లారి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నగిరిపల్లికి వచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకురావడంతో సానుకూలంగా స్పందించిన ఆయన పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. అలాగే సూపర్ సిక్స్ పధకాలు కూడా అమలుకు త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.