Home » Kutami
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గురువారం ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. జిఏడి టవర్ బేస్మెంట్ +39 ఆఫీసు ప్లోర్లు+ టెర్రస్ ప్లోర్లు 17 లక్షల 03 వేల 433 చదరపు అడుగుల నిర్మాణానికి క్యాబినెట్లో చర్చ జరగనుంది. హెడ్ వోడి టవర్స్ 1, 2 కుI బేస్మెంట్ +39 ప్లోర్స్ + టెర్రస్ నిర్మాణం ద్వారా 28 లక్షల 41 వేల 675 చదరపు అడుగులు నిర్మాణానికి మంత్రిమండలిలో చర్చ జరుగుతుంది.
క్వార్ట్జ్ కుంభకోణంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రూప్ కుమార్ కోసం... డిప్యూటీ డైరెక్టర్ డిజిటల్ సిగ్నేచర్‌నే గప్‌చుప్‌గా తొలగించేశారు. కింది స్థాయి అధికారితో ఫైల్ అప్లోడ్ చేయించారు. ఎక్కడో తేడా కొట్టిందనే అనుమానంతో తెల్లారేసరికి అనుమతులు రద్దు చేశారుగానీ... లేకపోతే ఈ పాటికి రూప్ కుమార్ గనుల్లో ‘అధికారికం’గా తవ్వకాలు మొదలయ్యేవి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్లు ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేస్తున్నారు. 1వ తేదీ సెలవు దినం అయితే ముందు రోజు ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తోంది. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పీఏసీ సభ్యుల ఎన్నికకు అసెంబ్లీలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఒకవైపు సభ జరుగుతుండగానే మరోవైపు పోలింగ్ జరుగుతోంది. కాగా ఓటింగ్‌ను బహిష్కరించే యోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది.
ఏపీ అసెంబ్లీ లాబీలో పీఏసీ సభ్యత్వానికి శుక్రవారం ఓటింగ్ జరగనుంది. మొత్తం 12 మంది సభ్యుల పదవులకు ఎన్నిక జరుగుతుంది. బలం లేకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది. దీంతో సంఖ్యాబలం ప్రకారమే ముందుకు వెళ్లాలని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పార్టీలు నిర్ణయించాయి.
ఏపీ శాసనసభలో గురువారం 6 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం పొందనున్నాయి. టెండర్లను న్యాయ పరిశీలనకు పంపే బిల్లు రద్దు, ఆలయాల ధర్మకర్తల మండళ్లలో సభ్యుల సంఖ్యకు అదనంగా మరో ఇద్దరిని నియమించుకునే వెసులుబాటు కల్పిస్తూ దేవాదాయశాఖ సవరణ చట్టం, సహజ వాయువుపై వ్యాట్‌ను తగ్గిస్తూ తీసుకొచ్చిన బిల్లు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తదితర బిల్లులపై సభలో చర్చించి ప్రభుత్వం ఆమోదించనుంది.
ఏపీ శాసనమండలి సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. అధికార.. విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, మాటల యుద్ధం జరుగుతోంది. వైఎస్సార్ సీసీకి మండలిలో మెజారిటీ సభ్యుల సంఖ్య ఉన్నప్పటికీ కూటమి మంత్రులు, ఎమ్మెల్సీలు ధీటుగా బదులిస్తున్నారు. దాంతో వైఎస్సార్ సీసీ ఎమ్మెల్సీలు సభలో ఉండలేక వాకౌట్ చేస్తున్నారు.
మహిళల భద్రతకు పెద్దపీట అని ఆర్భాటపు ప్రచారాలు తప్ప10 ఏళ్లలో ఏ ఒక్క నేరస్థుడికీ కఠిన శిక్ష పడలేదని వైఎస్ షర్మిల అన్నారు. కేసులు ఛేదించాల్సిన పోలీసులను కక్ష్యసాధింపు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తర సమయం కొనసాగుతోంది. మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. నిరుపయోగంగా ఉన్న భూమలును పేదలకు అసైన్డ్ చేసిందని, గత ప్రభుత్వం ఎన్నికలకు ఆరు నెలల ముందు నిషిద్ద 22 ఏ నుండి 9 లక్షలకు పైచిలుకు తొలగించాలని చూసారన్నారు.
అమరావతి: అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. అనంతరం ప్రభుత్వం సభలో ఐదు బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్..