Share News

AP News: అలాంటి ప్రచారం నేరం.. తిరుపతి ఘటనపై ఎస్పీ

ABN , Publish Date - Nov 05 , 2024 | 03:30 PM

Andhrapradesh: అత్యాచారం జరిగిందని పాప గాని, పాప తల్లిదండ్రులు గాని చెప్పకపోయినా అత్యాచారం జరిగినట్టు ప్రచారం చేయడం నేరమని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. ఫోక్సో చట్టం కింద కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. బాలికకు పీహెచ్‌సీలో మొదట వైద్య పరీక్షలు జరిగాయని... ఆ తరువాత తిరుపతి మెటర్నిటీలో కూడా నిష్ణాతులైన వైద్యుల చేత..

AP News: అలాంటి ప్రచారం నేరం.. తిరుపతి ఘటనపై ఎస్పీ
Tirupati SP Subbaraidu

తిరుపతి, నవంబర్ 5: తిరుపతిలో మైనర్ బాలికపై అత్యాచారం జరగనప్పటికీ జరిగినట్లు సాక్షి పత్రికలో కథనం ప్రచురితం అవడంపై తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు స్పందించారు. మంగళవారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. అత్యాచారం జరిగిందని పాప గాని, పాప తల్లిదండ్రులు గాని చెప్పకపోయినా అత్యాచారం జరిగినట్టు ప్రచారం చేయడం నేరమన్నారు. ఫోక్సో చట్టం కింద కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. బాలికకు పీహెచ్‌సీలో మొదట వైద్య పరీక్షలు జరిగాయని... ఆ తరువాత తిరుపతి మెటర్నిటీలో కూడా నిష్ణాతులైన వైద్యుల చేత వైద్య పరీక్షలు కోసం రాత్రి తిరుపతికి తీసుకొచ్చినట్లు తెలిపారు.

YS Sharmila: విద్యుత్ చార్జీలపై వైఎస్ షర్మిల


రేప్ జరిగిన ఆధారాలు లేదని తిరుపతి మెటర్నిటీలోని వైద్యులు రాత్రి స్పష్టంగా చెప్పారన్నారు. పాప స్టేట్‌‌మెంట్‌లో సందిగ్ధం ఉందని రాత్రి చెప్పామని.. రాత్రి మెడికల్ ఎగ్జామినేషన్‌లో అత్యాచారం జరగలేదని వైద్యులు చెప్పిన విషయం మీడియాకు కూడా చెప్పామని తెలిపారు. అయినా కొంతమందిలో ఎందుకు అంత ఉత్సాహం అంటూ మండిపడ్డారు. పోలీస్.. విక్టిమ్ వైపే అని స్పష్టం చేస్తున్నట్లు తెలిపారు. ఫోక్సో చట్టంలో మైనర్‌కు చాలా హక్కులు ఉన్నాయన్నారు. వారి ప్రైవసీకి, హక్కులకు భంగం కలిగేలా ఎవరు వ్యవహరించినా కేసు నమోదు చేశాక కఠినంగా వ్యవహరిస్తామని.. మళ్లీ ఇలాంటివి రిపీట్ కాకుండా చర్యలు ఉంటాయని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు.

Pawan Kalyan: పెట్రోల్ బాంబులు వేసి భయభ్రాంతులకు గురిచేశారు


కాగా... తిరుపతిలో జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు సాక్షి పత్రిక మెయిన్ పేజీలో వార్త వచ్చింది. అయితే ఈ వార్తపై బాలిక తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు. ‘‘నా కుమార్తెపై ఎలాంటి అత్యాచారం జరగలేదు. గతంలో ప్రేమ పేరుతో కొందరు వేధించారు. వారు నిన్న (సోమవారం) వెంటబడి దాడి చేయాలని ప్రయత్నించారు. సమయానికి కొంతమంది రక్షించారు. అయితే ఈ విషయాన్ని కొంతమంది స్వప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు అందరూ అండగా ఉన్నారు. పోలీసులు, ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించారు’’ అని బాలిక తండ్రి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

Nimmala: ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష

Kesineni Chinni: ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిపై ఎంపీ కేశినేని సమీక్ష..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 05 , 2024 | 03:47 PM