Share News

Subbarayadu: న్యూఇయర్ వేడుకలు శృతి మించితే.. అంతే

ABN , Publish Date - Dec 30 , 2024 | 03:43 PM

Andhrapradesh: సైబర్ నేరాలు పెరిగాయని.. కానీ సైబర్ నేరాలకు పాల్పడిన నేరస్తులను అరెస్టులు చేసి బాధితులకు న్యాయం చేశామని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. సైబర్ క్రైం వారోత్సవాలను కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో నిర్వహించామని చెప్పారు. తిరుమల పర్యటనకు వచ్చిన వీఐపీలందరికీ పటిష్టమైన భద్రత కల్పించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అప్రమత్తంగా వ్యవహరించామన్నారు.

Subbarayadu: న్యూఇయర్ వేడుకలు శృతి మించితే.. అంతే
Tirupati SP Subbaraidu

తిరుపతి, డిసెంబర్ 30: గత ఆరునెలల్లో తిరుపతి జిల్లాలో క్రైం రేటు బాగా తగ్గిందని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు (Tirupati SP Subbaraidu తెలిపారు. సోమవారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. పటిష్టమైన పకడ్బందీ భద్రతా ఏర్పాట్లతో నేరనియంత్రణ చేలగలిగామన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు వివరిస్తూ పూర్తి స్థాయి అవగాహన కల్పించామన్నారు. యువతలో మార్పు తీసుకువచ్చామన్నారు. సైబర్ నేరాలు పెరిగాయని.. కానీ సైబర్ నేరాలకు పాల్పడిన నేరస్తులను అరెస్టులు చేసి బాధితులకు న్యాయం చేశామన్నారు. సైబర్ క్రైం వారోత్సవాలను కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో నిర్వహించామని చెప్పారు. తిరుమల పర్యటనకు వచ్చిన వీఐపీలందరికీ పటిష్టమైన భద్రత కల్పించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అప్రమత్తంగా వ్యవహరించామన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని సంచలనాత్మక కేసులను త్వరితగతిన చేధించానమన్నారు.


శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకున్నామని... పీడీ యాక్ట్‌లు పెట్టడంతో స్మగ్లర్లు వెనక్కి తగ్గారన్నారు. హోంస్టేలపై ప్రత్యేక నిఘా పెంచామని... అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా అడ్డుకట్ట వేశామన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఆరునెలల్లో ఏడు శాతం కేసులు తగ్గాయని ఎస్పీ వెల్లడించారు.

ISRO: PSLV C - 60 రాకెట్.. నిర్విగ్నంగా కొనసాగుతున్న కౌంట్ డౌన్



శృతిమించితే..

నూతన సంవత్సర వేడుకలను జాగ్రత్తగా జరుపుకోవాలని సూచించారు. శృతిమించి వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలో డీజేలకు అనుమతులు లేవన్నారు. ఫ్లైఓవర్‌ను 31వ తేదీ రాత్రి 11గంటలకు మూసేస్తామన్నారు. అశ్లీల నృత్యాలకు అనుమతులు లేవన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు చేస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలను నడిపితే కేసులు పెడతామన్నారు. ఆధ్యాత్మిక పవిత్రతకు భంగం కలిగిస్తే కేసులు పెడతామని ఎస్పీ సుబ్బారాయుడు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

కొత్త సంవత్సరంలో జరగబోయే మార్పులు ఇవే

వేతనాల గురించి సీఎం కీలక ప్రకటన.. వీరికి గుడ్ న్యూస్..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 30 , 2024 | 03:43 PM