Bhanuprakash: శ్రీవారి హుండీలో కూడా దోపిడీ
ABN , Publish Date - Dec 25 , 2024 | 03:44 PM
Andhrapradesh: టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. హుండీలో పడిన విదేశీ కరెన్సీనీ వజ్రాలను దోచుకున్న రవి అనే వ్యక్తితో జగన్ ప్రభుత్వంలోని టీటీడీ ఉన్నతాధికారులు దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని పోలీసులు.. టీటీడీ విజిలెన్స్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి కేసు నీరుగారేలా చేసినట్లు విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు.
తిరుపతి, డిసెంబర్ 25: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former Minister YS Jaganmohan Reddy) టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి (TTD Governing Council Member Bhanu Prakash Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శ్రీవారి హుండీలో కూడా దోపిడీ జరిగిందని ఆరోపించారు. హుండీలో పడిన విదేశీ కరెన్సీనీ వజ్రాలను దోచుకున్న రవి అనే వ్యక్తితో జగన్ ప్రభుత్వంలోని టీటీడీ ఉన్నతాధికారులు దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని పోలీసులు.. టీటీడీ విజిలెన్స్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి కేసు నీరుగారేలా చేసినట్లు విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. టీటీడీ విజిలెన్స్‌ను అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని ఏ పోలీస్ అధికారులు ఒత్తిడి తెచ్చారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రవి హుండీలో దోచుకున్న సొమ్ముతో దేశవ్యాప్తంగా కొన్న అనేక ఆస్తుల్లో కొన్నిటిని టీటీడీకి రాయించుకున్నారని తెలిపారు.
జగన్ ప్రభుత్వంలోని టీటీడీ ఉన్నతాధికారులు హుండీలో దోపిడీ చేసిన రవి దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు దోచుకున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. దీని వెనుక ఉన్న శక్తులు, వ్యక్తులు, పాత్రధారతులు, సూత్రధారులు, వాటదారులు ఎవరున్నారు అనే అంశంపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయాలన్నారు. సాక్షాధారాలు లేకుండా తారుమారు చేసినట్టు కూడా తమకు సమాచారం అందుతోందని చెప్పారు. రవికుమార్ ప్రాణాలకు హాని ఉందని.. అతనికి సెక్యూరిటీ ఇవ్వాలని భద్రత కల్పించాలన్నారు.
TG News: సినిమాను తలపించేలా ఫైట్..
ఇది రూ.100 కోట్లు కాదు రూ.500 కోట్లు రూపాయల స్కాం అని చెప్పారు. హుండీలో కొళ్లగొట్టిన వాడితో కొల్యుడ్ అయి కాంప్రమైజ్ అవడం జగన్ ప్రభుత్వంలో జరిగిందన్నారు. ఇలా జగన్ ప్రభుత్వంలో ఎన్నో దారుణాలు జరిగాయని ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ నివేదికలో చాలా వివరంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ నివేదిక ప్రకారం తదుపరి చర్యలు జరిగితే అనేకమంది జైలుకు పోతారని భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం
Read latest AP News And Telugu News