Share News

PoliceCustody: సీఐడీ కస్టడీకి పానుగంటి చైతన్య

ABN , Publish Date - Oct 25 , 2024 | 05:10 AM

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి, విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యను సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

PoliceCustody: సీఐడీ కస్టడీకి పానుగంటి చైతన్య

  • టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు

గుంటూరు, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి, విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యను సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సోమవారం ఉదయం 11 గంటల వరకు మూడు రోజుల పాటు చైతన్యను సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఆ తర్వాత ఆయనను జైలులో హాజరుపరచాల్సి ఉంది.


2021 అక్టోబరు 19న పానుగంటి చైతన్య నేతృత్వంలో సుమారు 200 మంది వరకు వైసీపీ మూక టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసి, విధ్వంసం సృష్టించింది. కాగా ఇటీవల ఈ కేసుకు సంబంధించిన అన్ని ఫైళ్లను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చైతన్యను కస్టడీకి ఇవ్వాలంటూ మంగళగిరి రూరల్‌ పోలీసులు అప్పట్లోనే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ అనంతరం పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది.

Updated Date - Oct 25 , 2024 | 05:10 AM