Share News

CM ChandraBabu: విజన్‌ డాక్యుమెంట్‌పై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

ABN , Publish Date - Nov 29 , 2024 | 05:05 PM

విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగింది. ఇక జగన్ పాలనతో ఏపీకి తీవ్ర నష్టం జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రపథాన నిలిపేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందుకోసం స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌కు శ్రీకారం చుట్టింది.

CM ChandraBabu:  విజన్‌ డాక్యుమెంట్‌పై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
AP CM ChandraBabu naidu

అమరావతి, నవంబర్ 29: అక్షర క్రమంలోనే కాదు.. అభివృద్ధిలో సైతం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా స్వర్ణాంధ్ర విజన్ 2047కు సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ ఆవిష్కరణకు చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం అమరావతిలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ విజన్ డాక్యుమెంట్‌రూపకల్పనపై ఈ సందర్భంగా కీలక అంశాలను చర్చించారు.

Also Read: భారీ వర్షాలు.. ఆ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్


గత అసెంబ్లీ సమావేశాల్లో స్వర్ణాంధ్ర విజన్-2047 డ్రాఫ్ట్ డాక్యుమెంట్‌ను శాసనసభ ద్వారా ప్రభుత్వం ప్రజల ముందు ప్రభుత్వం ఉంచిన సంగతి తెలిసిందే. నీతి ఆయోగ్‌తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో ఈ విజన్ డాక్యుమెంట్‌ను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఇప్పటికే వివిధ ఏజెన్సీలు, పలువురు నిపుణులు, మేధావులతోపాటు 17 లక్షల మంది నుంచి విజన్ డాక్యుమెంట్‌పై సూచనలు, సలహాలను ఈ ప్రభుత్వం తీసుకుంది. అందరి అభిప్రాయాలు, ఆలోచనలను పరిశీలించిన ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకుంది.

Also Read: కేసీఆర్ దీక్ష ఫేక్.. విచారణ జరపాలి


మరికొద్ది రోజుల్లో ఈ విజన్ డాక్యుమెంట్‌‌ను విడుదల చేయనుంది. స్వర్ణాంధ్ర విజన్ - 2047ను డిసెంబర్ 12వ తేదీన విద్యార్థులు, సామాన్య ప్రజల సమక్షంలో ఈ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అలాగే ఈ విజన్‌కు సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు 10 సూత్రాలను ప్రకటించిన విషయం విధితమే. పేదరికం లేని సమాజం, ఉపాధి కల్పన, నైపుణ్యం- మానవవనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయంలో సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు - బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్... అనే ప్రధాన సూత్రాలు, లక్ష్యాల సాధన కోసం ఈ విజన్ డాక్యుమెంట్‌ను చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రూపొందిస్తుంది.


ఈ లక్ష్యాలను సాధించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలను ఈ విజన్ డాక్యుమెంట్‌లో స్పష్టంగా ప్రభుత్వం పొందుపరిచింది. రాష్ట్రంతో పాటు జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయి వరకు అభివృద్ధి కోసం ఈ విజన్ డాక్యుమెంట్‌లను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది.


మొత్తం 23 జిల్లాలతో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌.. రాష్ట్ర విభజన కారణంగా 13 జిల్లాలకు పరిమితమై పోయింది. రాజధాని హైదరాబాద్‌ తెలంగాణకు వెళ్లిపోయింది. దీంతో ఏపీకి రాజధాని లేకుండా పోయింది. అంతే కాదు పలు సంస్థలు సైతం హైదరాాబాద్‌లోనే ఉండిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు జీవనోపాధి, యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాభివృద్ధికి ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఆ క్రమంలో విజన్ డాక్యుమెంట్ 2047కు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.


For AndhraPradesh news And Telugu News

Updated Date - Nov 29 , 2024 | 05:05 PM