CM Chandrababu : ఒకరోజు ముందే పించన్ల పంపిణీ
ABN , Publish Date - Dec 30 , 2024 | 03:44 AM
ఈ నెల కూడా సామాజిక పింఛన్లను ఒక రోజు ముందే పంపిణీ చేయనున్నారు. ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు...
ఈనెల కూడా ఒకరోజు ముందే
పల్నాడు జిల్లాలో పాల్గొననున్న సీఎం
అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఈ నెల కూడా సామాజిక పింఛన్లను ఒక రోజు ముందే పంపిణీ చేయనున్నారు. ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లా నరసారావుపేట నియోజకవర్గం యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10.50 గంటలకు యల్లమంద గ్రామానికి చేరుకుని 11.30 గంటల వరకు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారు. అనంతరం 12.35 గంటల వరకు లబ్ధిదారులతో చంద్రబాబు ముచ్చటిస్తారు.