Share News

AP Politics: ఆ మంత్రుల పనితీరుపై సీఎం జగన్ ఆగ్రహం!

ABN , Publish Date - Jan 31 , 2024 | 05:12 PM

ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక నేతల వలసల పర్వం కొనసాగుతుంది. ఆయా పార్టీలలో ఉండి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు క్రమంగా ఇతర పార్టీల వైపు మొగ్గుచూపుతున్నారు.

 AP Politics: ఆ మంత్రుల పనితీరుపై సీఎం జగన్ ఆగ్రహం!

ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక నేతల వలసల పర్వం కొనసాగుతుంది. ఆయా పార్టీలలో ఉండి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు క్రమంగా ఇతర పార్టీల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ నేత సీఎం జగన్(jagan) గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేత కేశీనేని నాని వైసీపీలో చేరగా..ప్రస్తుతం అమరావతి ప్రాంతానికి చెందిన టీడీపీ మాజీ మంత్రి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: YCP Rebel MLAs: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు జారీ


ఈ నేపథ్యంలోనే టీడీపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చి ఆయనను కలిశారు. ఆ క్రమంలో కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో రావెల చేరిక దాదాపు ఫైనల్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే కేబినెట్ అజెండా ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం జగన్ రాజకీయ అంశాలపై చర్చించారు.

స్థానచలనం పొందిన మంత్రులు జనంతో మమేకం కావాలని సీఎం వారికి ఆదేశించారు. దీంతోపాటు ఒకరిద్దరు మంత్రుల పనితీరు గురించి జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వారిని ఇతర మంత్రుల పనితీరుతో పోల్చి చూపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికలనాటికైనా వారి పనితీరు మార్చుకోవాలని సీఎం హితవు పలికారని తెలిసింది. అంతేకాదు సీట్లు మార్పు విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను ధీటుగా తిప్పికొట్టాలని జగన్ వారికి సూచించారు.

మరోవైపు వైసీపీలో ఉన్న అసంతృప్తి నేతలు టీడీపీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఆయన తనయుడు నారాయణ వనం, జడ్పీటీసీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్ లోకేష్‌తో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో సత్యవేడులో టీడీపీ విజయానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. వైసీపీలో మనోవేదన తట్టుకోలేక టీడీపీలో ఏమి ఆశించకుండా చేరినట్లు వారు వెల్లడించారు.

Updated Date - Jan 31 , 2024 | 05:12 PM