Share News

YSRCP: రాజ్యసభ అభ్యర్థులను మార్చిన జగన్.. తెరపైకి కొత్త వ్యక్తి..!

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:39 PM

రాజ్యసభ అభ్యర్థులను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మార్చివేశారు. గతంలో లీక్‌లు ఇచ్చిన ముగ్గురిలో ఒక అభ్యర్థిని మార్చేశారు. ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు స్థానంలో కడపకు చెందిన మేడా రఘునాథరెడ్డి పేరు జగన్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. మొత్తం మూడు సీట్లలో పోటీ చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది..

YSRCP: రాజ్యసభ అభ్యర్థులను మార్చిన జగన్.. తెరపైకి కొత్త వ్యక్తి..!

అమరావతి: రాజ్యసభ అభ్యర్థులను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మార్చివేశారు. గతంలో లీక్‌లు ఇచ్చిన ముగ్గురిలో ఒక అభ్యర్థిని మార్చేశారు. ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు స్థానంలో కడపకు చెందిన మేడా రఘునాథరెడ్డి పేరు జగన్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. మొత్తం మూడు సీట్లలో పోటీ చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. సాయంత్రం ముగ్గురి పేర్లు ప్రకటిస్తారని సమాచారం. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథరెడ్డి పేర్లు ఖరారు అవుతాయని సమాచారం. ఈ నెల 8న అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కావడంతో ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది.

ysrcp-telugubulletin-696x41.gif

ఏం జరుగునో..?

రాజ్యసభ ఎన్నికలు రాష్ట్రంలో వేడి పుట్టిస్తున్నాయి. సాధారణంగా ఏకగ్రీవంగా జరిగే ఈ ఎన్నికల్లో ఈసారి పోటీ తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. వైసీపీలో అంతర్గత సంక్షోభాన్ని ఆసరా చేసుకుని ఒక సీటు కైవసం చేసుకోడానికి టీడీపీ పావులు కదుపుతోంది. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకోడానికి అధికారపక్షం తిప్పలు పడుతోంది. ఈసారి రాష్ట్రం నుంచి ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రిటైర్ అయ్యారు. వారి స్థానాలకు ఎన్నికల నిర్వహణకు కొద్ది రోజుల క్రితం షెడ్యూల్ వెలువడింది.

Updated Date - Feb 06 , 2024 | 04:05 PM