Bhogapuram Airport : భోగాపురం విమానాశ్రయం పనులను వేగంగా పూర్తి చేయండి: సీఎస్
ABN , Publish Date - Dec 24 , 2024 | 06:10 AM
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను నిర్దిష్ట కాలపరిమితికి లోబడి సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను నిర్దిష్ట కాలపరిమితికి లోబడి సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖలు, ఏజెన్సీలకు సూచించారు. సోమవారం అమరావతి సచివాలయం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం సమన్వయ కమిటీ మొదటి సమావేశాన్ని సీఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా విమానాశ్రయ నిర్మాణంతోపాటు అక్కడ వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు చేయాల్సిన ఏర్పాట్లను కూడా సమీక్షించారు.