Share News

రాజ్యాంగం పుస్తకాన్ని విద్యార్థులకు అందిస్తాం: లోకేశ్‌

ABN , Publish Date - Nov 27 , 2024 | 05:04 AM

‘గత ఐదేళ్లలో రాజ్యాంగం విలువ తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను. ఈ పుస్తకం పట్టుకొని పాదయాత్ర చేశాను. ఆర్టికల్‌ 19 ప్రకారం ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌, ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌ గురించి గళమెత్తా’ అని మం త్రి నారా లోకేశ్‌ అన్నారు.

రాజ్యాంగం పుస్తకాన్ని విద్యార్థులకు అందిస్తాం: లోకేశ్‌

‘గత ఐదేళ్లలో రాజ్యాంగం విలువ తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను. ఈ పుస్తకం పట్టుకొని పాదయాత్ర చేశాను. ఆర్టికల్‌ 19 ప్రకారం ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌, ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌ గురించి గళమెత్తా’ అని మం త్రి నారా లోకేశ్‌ అన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడా రు. ‘నేను పాదయాత్ర చేసేటప్పుడు నాటి పాలకులు, అధికారులు రాజ్యాంగ నిబంధనలను పాటించలేదు. అప్పటి ప్రతిపక్ష నే త చంద్రబాబునూ ఎన్నో ఇబ్బందులకు గు రి చేశారు. దాని ఫలితమే గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘పిల్లల కోసం భారత రాజ్యంగం’ పేరుతో ప్రాథమిక హక్కులు, ఇతర అంశాలు, సమరయోధుల చరిత్ర తెలిపే విధంగా పుస్తకాలు రూపొందించి అందించాలని నిర్ణయించాం’ అని లోకేశ్‌ తెలిపారు.

Updated Date - Nov 27 , 2024 | 05:04 AM