Home » Nara Lokesh Red Book
Nara Lokesh :వైసీపీ పాలనలో ఇసుక అక్రమ మైనింగ్ జరిగిందని ఆంధప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అడ్వాంటేజ్‌గా పని చేస్తున్నారని తెలిపారు. టాటా పవర్‌తో 7 గిగా వాట్స్ ఒప్పందం జరిగిందని మంత్రి నారా లోకేష్ చెప్పారు.
రాష్ట్రంలో రెడ్‌బుక్ అమలుచేస్తే వైసీపీ నేతలెవ్వరూ రోడ్డుపై తిరగలేరని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్‌బుక్ తెరిచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతోందని విమర్శిస్తున్నారు. రెడ్‌బుక్ పేరుతో ఇష్టారీతిగా కూటమి ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు.
సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నాం. కక్షసాధింపు మా విధానం కాదు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిద్దాం.
Palla Srinivas Rao:జగన్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు పారిపోయేలా చేశారని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌రావు ఆరోపించారు. వైసీపీ నేతలు రెడ్‌బుక్ చూస్తుంటే భయపడుతున్నారని అన్నారు. తప్పుచేసిన వైసీపీ నేతలను, అధికారులను వదలబోమని పల్లా శ్రీనివాస్‌రావు హెచ్చరించారు.
‘గత ఐదేళ్లలో రాజ్యాంగం విలువ తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను. ఈ పుస్తకం పట్టుకొని పాదయాత్ర చేశాను. ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ గురించి గళమెత్తా’ అని మం త్రి నారా లోకేశ్ అన్నారు.
మహిళల మరణాలకు కారణమయ్యే వారికి భయం క్రియేట్ అయ్యేలా వ్యవహరిస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. స్మార్ట్ పోలీసింగ్‌కు మరో మూడువేల సీపీ కెమెరాలు తిరుపతిలో ఏర్పాటుకు యత్నిస్తామని అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి మళ్లీ టాస్క్ ఫోర్స్ రంగంలోకి వస్తోందని
సాక్షి మీడియా ఇప్పటికైనా వాస్తవాలు ప్రజలకు చెప్పాలని కోరుతున్నామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సాక్షి పత్రిక 2019లో తన పైన తప్పుడు రాతలు రాశారని మండిపడ్డారు. రూ. 75 కోట్ల పరువు నష్టం దావా వేశానని అన్నారు. ప్రజలపై భారంపడేలా ప్రభుత్వ వాహనాలు.. ఎకామిడేషన్ గాని వినియోగించలేదని చెప్పారు.
పది వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ను విశాఖకు జగనే తీసుకొచ్చినట్లుగా ఆయన రోజూ రాత్రిపూట మాట్లాడుకునే ఆత్మ చెప్పిందేమోనని ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేశ్ ఎద్దేవాచేశారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాల లెక్కలన్నీ బయటపెడతామని మంత్రి నారా లోకేష్ అన్నారు. అక్రమాలకు బాధ్యులైన అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి లోకేష్..