Pemmasani Chandrasekhar : పత్తి కొనుగోళ్లు ఆపొద్దు
ABN , Publish Date - Nov 27 , 2024 | 04:51 AM
ఉభయ తెలుగు రాష్ర్టాల్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పత్తి కొనుగోళ్లు ఆగకూడదని కేంద్ర గ్రామీణాభివృద్థి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టంచేశారు.
సీసీఐ సీఎండీతో కేంద్ర మంత్రి పెమ్మసాని
గుంటూరు సిటీ, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): ఉభయ తెలుగు రాష్ర్టాల్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పత్తి కొనుగోళ్లు ఆగకూడదని కేంద్ర గ్రామీణాభివృద్థి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టంచేశారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ లలిత్‌కుమార్ గుప్తాను మంగళవారం ఢిల్లీలో పెమ్మసాని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలక్కుండా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరపాలని, తేమ శాతంలోనూ న్యాయం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా లలిత్‌కుమార్ మాట్లాడుతూ రైతుల సమస్యలపై ‘కాటన్ యాలీ’ యాప్ అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ యాప్ ద్వారా పత్తి సేకరణ, ఉత్పత్తి, ఆధార్ లింక్, బ్యాంక్ అకౌంట్ అనుసంధానం ద్వారా రైతులకు నగదు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.