Share News

విద్యాసాగర్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ 3కు వాయిదా

ABN , Publish Date - Nov 29 , 2024 | 05:07 AM

సినీ నటి కాదంబరి జెత్వాని కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీనేత కుక్కల విద్యాసాగర్‌ వేసిన పిటిషన్‌ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది.

విద్యాసాగర్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ 3కు వాయిదా

అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): సినీ నటి కాదంబరి జెత్వాని కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీనేత కుక్కల విద్యాసాగర్‌ వేసిన పిటిషన్‌ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ప్రాసిక్యూషన్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ పిటిషన్‌ విషయంలో గురువారమే కౌంటర్‌ దాఖలు చేశామన్నారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జెత్వాని తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు స్పందిస్తూ కౌంటర్‌ వేసేందుకు మరికొంత సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కె కృపాసాగర్‌ పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబర్‌ 3కి వాయిదా వేశారు.

Updated Date - Nov 29 , 2024 | 05:09 AM