Share News

CPI Ramakrishna : అల్లు అర్జున్‌కు జగన్‌ వత్తాసు నీచాతినీచం

ABN , Publish Date - Dec 16 , 2024 | 06:26 AM

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌.. సినీ హీరో అల్లు అర్జున్‌కు వత్తాసుగా మాట్లాడటం నీచాతినీచమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు.

CPI Ramakrishna : అల్లు అర్జున్‌కు జగన్‌ వత్తాసు నీచాతినీచం

  • సీపీఐ రామకృష్ణ

అమరావతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌.. సినీ హీరో అల్లు అర్జున్‌కు వత్తాసుగా మాట్లాడటం నీచాతినీచమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఓట్ల కోసం రాజకీయ నేతలు సినిమా హీరోలకు ఊడిగం చేయడం సిగ్గుచేటన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ ఘటనలో కనీస మానవత్వంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా రూ.వందల కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకున్న సినిమా హీరోకి జగన్‌, బండి సంజయ్‌ వత్తాసు పలకడం సిగ్గుచేటు. పుష్ప-2 సినిమా టిక్కెట్‌ ధర రూ.1200లకు పెంచడం దారుణం. అని రామకృష్ణ వివరించారు.

  • వర్సిటీలకు వీసీలను నియమించండి

యూనివర్సిటీలకు వెంటనే వీసీలను నియమించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం మంత్రి లోకేశ్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలైనా ఇంకా ఉన్నత విద్యామండలికి చైర్మన్‌ను నియమించలేదని పేర్కొన్నారు. 4,439 ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ మధ్యలోనే ఆగిపోయిందన్నారు.

Updated Date - Dec 16 , 2024 | 06:26 AM