Share News

Jagan: జగన్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 02 , 2024 | 02:04 PM

వైసీపీ అధినేత జగన్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి అవసరమని.. ఈ విషయాన్ని జగన్ తెలుసుకోలేకపోయారన్నారు. జగన్ న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడం వల్లే వైసీపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. బీజేపీతో ఉంటే ఉన్నామని.. లేకపోతే లేమని జగన్ గట్టిగా చెప్పలేకపోయారన్నారు.

Jagan: జగన్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

విశాఖ: వైసీపీ అధినేత జగన్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి అవసరమని.. ఈ విషయాన్ని జగన్ తెలుసుకోలేకపోయారన్నారు. జగన్ న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడం వల్లే వైసీపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. బీజేపీతో ఉంటే ఉన్నామని.. లేకపోతే లేమని జగన్ గట్టిగా చెప్పలేకపోయారన్నారు. అసెంబ్లీలో సభ్యుల సంఖ్యను బట్టి ప్రతిపక్ష హోదా ఉంటుందని.. అంతే తప్ప ఓట్ల శాతం బట్టి ఉండదన్నారు. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తే సరిపోదని.. అభివృద్ధి కూడా కావాలని నారాయణ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోవడం వల్లనే వైసీపీకి 11 స్థానాలు వచ్చాయన్నారు.


న్యూట్రల్ స్టాండ్ వలన జగనే కాదని.. కేసీఆర్, నవీన్ పట్నాయక్ కూడా తీవ్రంగా నష్టపోయారన్నారు. బీజేపీతో కలిసి వెళ్లాలని.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారని.. అది వాళ్ల వరకూ కరెక్టేనని నారాయణ అన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించామన్నారు. జగన్ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. రుషికొండ భవనాలు నిర్మించేటప్పుడు ప్రతిపక్ష నేతలను అక్కడకు జగన్ సర్కార్ వెళ్లనీయలేదన్నారు. ఈ భవనాల్ని కూటమి ప్రభుత్వం ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించాలని నారాయణ తెలిపారు. కూటమిలో పవన్ కళ్యాణ్ డైనమిక్ పాత్ర పోషించారన్నారు. పవన్‌కి మంచి సినిమా పాపులారిటీ ఉందని.. అది ఎన్నికల్లో ప్లస్ అయిందన్నారు. అందుకే పోటీ చేసిన అన్నిచోట్ల జనసేన గెలిచిందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోనని పవన్ ముందే చెప్పారని పవన్ అన్నారు.

Updated Date - Jul 02 , 2024 | 02:04 PM