Andhra Pradesh : తిరుమలలో పెరిగిన రద్దీ
ABN , Publish Date - May 24 , 2024 | 04:40 AM
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూకౌంటర్, అన్నప్రసాద భవనం, లేపాక్షి సర్కిల్ ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సర్వదర్శన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్లుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి.
తిరుమల, మే23(ఆంధ్రజ్యోతి): తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూకౌంటర్, అన్నప్రసాద భవనం, లేపాక్షి సర్కిల్ ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సర్వదర్శన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్లుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వీరికి 24 గంటల దర్శన సమయం పడుతోంది. కాగా, తిరుమలలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడసేవ కన్నులపండువగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి గరుడుడిపై కొలువుదీరి మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
నేడు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటా
ఆగస్టు నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేయనుంది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ‘టీటీదేవస్థానమ్స్.ఏపీ.జీవోవీ.ఇన్’ ద్వారా ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.