Share News

Kesineni Chinni: వైసీపీ ఆరాచ‌క పాల‌న‌పై న్యాయపోరాటంలో ద‌మ్మాల‌పాటిదే కీల‌క‌పాత్ర

ABN , Publish Date - Jun 20 , 2024 | 11:05 AM

రాష్ట్ర అడ్వకేట్ జ‌న‌ర‌ల్‌గా ప‌ద‌వీ బాధ్యత‌లు చేప‌ట్టినందుకు దమ్మాలపాటి శ్రీనివాస్‌కు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అభినంద‌న‌లు తెలిపారు. వైసీపీ ఆరాచ‌క పాల‌న‌పై చేసిన‌ న్యాయపోరాటంలో దమ్మాలపాటి కీల‌క‌పాత్ర పోషించారన్నారు. న్యాయ‌శాస్త్రంపై మంచి ప‌ట్టువన్న న్యాయ‌వాది ఏజీ ద‌మ్మాల‌పాటి శ్రీనివాస్ అని పేర్కొన్నారు.

Kesineni Chinni: వైసీపీ ఆరాచ‌క పాల‌న‌పై న్యాయపోరాటంలో ద‌మ్మాల‌పాటిదే కీల‌క‌పాత్ర

విజ‌య‌వాడ: రాష్ట్ర అడ్వకేట్ జ‌న‌ర‌ల్‌గా ప‌ద‌వీ బాధ్యత‌లు చేప‌ట్టినందుకు దమ్మాలపాటి శ్రీనివాస్‌కు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అభినంద‌న‌లు తెలిపారు. వైసీపీ ఆరాచ‌క పాల‌న‌పై చేసిన‌ న్యాయపోరాటంలో దమ్మాలపాటి కీల‌క‌పాత్ర పోషించారన్నారు. న్యాయ‌శాస్త్రంపై మంచి ప‌ట్టువన్న న్యాయ‌వాది ఏజీ ద‌మ్మాల‌పాటి శ్రీనివాస్ అని పేర్కొన్నారు. ఏజీగా బాధ్యత‌లు స్వీక‌రించిన ద‌మ్మాల‌పాటి ఎన్టీఆర్ జిల్లా వాసి కావ‌టం పట్ల గర్వంగా ఉందన్నారు. ఏజీగా రెండోసారి ప‌ద‌వీ బాధ్యత‌లు స్వీక‌రించిన ద‌మ్మాల‌పాటి అనుభ‌వం రాష్ట్రానికి అవ‌స‌రమన్నారు.


2019లో దమ్మాలపాటిపై క్రిమినల్‌ కేసులు పెట్టి జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ బాధితుల్లో ఏజీ ద‌మ్మాల‌పాటి కూడా ఒక‌రని కేశినేని చిన్ని అన్నారు. గ‌త ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో అక్రమ‌ భూములు ఉన్నాయని.. అక్రమ కేసుల‌తో వేధించిందన్నారు. ద‌మ్మాల‌పాటి పై నమోదైన అక్రమ కేసులను ఆయనే వాదించుకొని ఆ కేసుల నుంచి బయటపడ్డారన్నారు. భ‌విష్యత్తులో మ‌రెన్నో ఉన్నత ప‌ద‌వులను దమ్మాలపాటి అలంక‌రించాల‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆకాక్షించారు.

Updated Date - Jun 20 , 2024 | 11:05 AM