Share News

Weather Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. కీలక అప్‌డేట్ ఇచ్చిన వాతావరణ శాఖ..

ABN , Publish Date - May 23 , 2024 | 04:10 PM

రెండు మూడు రోజులకు ఒకసారైనా వస్తున్న వానలతో ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందుతున్న ఏపీ ప్రజలకు షాకింగ్ వార్త చెప్పింది వాతావరణ శాఖ. రాష్ట్రంపై మళ్లీ భానుడి ప్రతాపం చూపించబోతున్నాడని తెలిపింది. అవును, వర్ష సూచన ఉన్నప్పటికీ.. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ..

Weather Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. కీలక అప్‌డేట్ ఇచ్చిన వాతావరణ శాఖ..
AP Weather

అమరావతి, మే 23: రెండు మూడు రోజులకు ఒకసారైనా వస్తున్న వానలతో ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందుతున్న ఏపీ ప్రజలకు షాకింగ్ వార్త చెప్పింది వాతావరణ శాఖ. రాష్ట్రంపై మళ్లీ భానుడి ప్రతాపం చూపించబోతున్నాడని తెలిపింది. అవును, వర్ష సూచన ఉన్నప్పటికీ.. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతం అయ్యిందని.. ప్రస్తుతం ఈశాన్య దిశగా కదులుతోందని.. రానున్న రెండు రోజుల్లో అది వాయుగుండంగా మారుతుందన్నారు.

ఆ తరువాత తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌పై లేదని.. పశ్చిమ బెంగాల్‌పై మాత్రమే ఉందన్నారు. ఈ కారణంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అల్పపీడనం ఏ దశలో ప్రయాణిస్తే.. ఆ ప్రభావిత రాష్ట్రాల్లో మాత్రమే వర్షాలు పడతాయని అన్నారు.


ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పగటి ఉష్ణో్గ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల మినహా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులు ఎండలు పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే, రానున్న 5 రోజుల్లో ఏపీలో ఒకటి, రెండు చోట్ల మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 23 , 2024 | 04:10 PM