Share News

Deputy CM Pawan: అవి నా మనసుకు నచ్చిన శాఖలు

ABN , Publish Date - Jun 16 , 2024 | 03:44 AM

మంత్రివర్గంలో నాకు కేటాయించిన శాఖలు నా మనస్సుకు, జనసేన మూలసిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయి అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తనకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆటవీ శాఖలు కేటాయించడంపై ఆయన స్పందించారు. ‘ఈ శాఖల ద్వారా ప్రజలకు నేరుగా సేవలందించే అవకాశం కలిగింది.

Deputy CM Pawan: అవి నా మనసుకు నచ్చిన శాఖలు

  • ప్రజలకు నేరుగా సేవచేసే అవకాశం

  • పల్లెలకు రక్షిత మంచినీరు లక్ష్యం

  • ఉపాధి నిధుల సద్వినియోగం,

  • మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి

  • అడవులను పరిరక్షిస్తాం

  • ఎర్రచందనం దొంగలపై ఉక్కుపాదం: పవన్‌ కల్యాణ్‌

  • అవి నా మనసుకు నచ్చిన శాఖలు

ప్రజలకు నేరుగా సేవచేసే అవకాశం.. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

అమరావతి, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): మంత్రివర్గంలో నాకు కేటాయించిన శాఖలు నా మనస్సుకు, జనసేన మూలసిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయి అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తనకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆటవీ శాఖలు కేటాయించడంపై ఆయన స్పందించారు. ‘ఈ శాఖల ద్వారా ప్రజలకు నేరుగా సేవలందించే అవకాశం కలిగింది. ప్రజల సమస్యలను గ్రామాల్లో స్వయంగా చూశాను. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తా. ఈ శాఖలన్నీ ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవి. విశాఖ మన్యంలో పర్యటిస్తున్నప్పుడు అక్కడ కురిడి గిరిజన గ్రామంలో గ్రామ ఆడపడచులు గుక్కెడు నీళ్ల కోసం పడుతున్న అవస్థలను కళ్లారా చూశాను. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా పల్లెలకు రక్షిత తాగునీరు అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తాం. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి. కరువు కాటకాలకు కారణమయ్యే అడవుల విధ్వంసాన్ని అరికడతాం. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాకు పాల్పడే వారు ఎంతటివారైనా కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే. జనసేనకు కేటాయించిన శాఖల ద్వారా చిత్తశుద్ధితో ప్రజాసేవలు అందిస్తాం. నా శాఖలపై మరింత లోతైన అధ్యయనం జరిపి ప్రజలకు మేలైన ఫలాలు అందించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Updated Date - Jun 16 , 2024 | 03:44 AM