Share News

AP News: ఢిల్లీలో కోడికత్తి శ్రీను కుటుంబసభ్యుల ధర్నా

ABN , Publish Date - Feb 08 , 2024 | 01:23 PM

Andhrapradesh: ఢిల్లీలో కోడికత్తి శ్రీను కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు. గురువారం ఢిల్లీ ఏపీ భవన్‌లో అంబేద్కర్ విగ్రహం ముందు కోడి కత్తి శ్రీను తల్లి,అన్న సుబ్బరాజు, టీడీపీ మైనార్టీ హక్కుల నాయకులు ధర్నా చేపట్టారు.

AP News: ఢిల్లీలో కోడికత్తి శ్రీను కుటుంబసభ్యుల ధర్నా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఢిల్లీలో కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. గురువారం ఢిల్లీ ఏపీ భవన్‌లో అంబేద్కర్ విగ్రహం ముందు కోడి కత్తి శ్రీను తల్లి, అన్న సుబ్బరాజు, టీడీపీ మైనార్టీ హక్కుల నాయకులు ధర్నా చేపట్టారు. జగన్ కోర్టుకు రావాలని... సాక్ష్యం చెప్పాలి అంటూ నినాదాలు చేశారు. కోడికత్తి కేసులో జగన్ నోరు విప్పాలని శ్రీను కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ లో దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులు ఆపాలని నినాదాలు చేశారు. ప్రజలకు కోడికత్తి నిందితులు ఎవరు అనేది జగన్ చెప్పాలని శ్రీను కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

కాగా.. కోడికత్తి శ్రీనుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కోడికత్తి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావుకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు వివరాలు మీడియాతో మాట్లాడొద్దని, ర్యాలీలు, సభల్లో పాల్గొనద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై దళిత, పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 08 , 2024 | 04:53 PM