Vijayawada : భవానీ దీక్షల విరమణలు ప్రారంభం
ABN , Publish Date - Dec 22 , 2024 | 06:38 AM
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర దేవస్ధానంలో భవానీ దీక్షల విరమణల కార్యక్రమం ప్రారంభమైంది.
ఇంద్రకీలాద్రికి భారీగా తరలివస్తున్న దీక్షాదారులు
విజయవాడ(వన్‌టౌన్), డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర దేవస్ధానంలో భవానీ దీక్షల విరమణల కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 25వ తేదీ వరకు దీక్షల విరమణలు కొనసాగనున్నాయి. దీక్షల విరమణల ప్రారంభ సూచికగా శనివారం ఉదయం 6.30 గంటలకు హోమగుండాల్లో అగ్ని ప్రతిష్టాపనతో, దీక్షా విరమణలకు అంకురార్పణ చేశారు. దీక్షా విరమణలకు అనేక ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో దీక్షాదారులు తరలి వస్తున్నారు. దుర్గామల్లేశ్వర దేవస్ధానం, జిల్లా యంత్రాంగం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శీఘ్ర దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. రుసుము ద్వారా దర్శనం, ఆర్జిత సేవలను ఈ నెల 25వ తేదీ వరకు రద్దు చేశారు.