BJP: ఏలూరు ఎంపీ సీటుపై బీజేపీలో రగులుతున్న అసంతృప్తి
ABN , Publish Date - Mar 12 , 2024 | 10:31 PM
ఏలూరు ఎంపీ సీటుపై బీజేపీ(BJP)లో అసంతృప్తి రగులుతోంది. బీజేపీని బలోపేతం చేసి పార్టీ కోసం కష్టపడ్డ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరికి సీటివ్వాలంటూ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు పార్లమెంట్‌లో గత కొన్నేళ్లుగా బీజేపీని గారపాటి సీతారామాంజనేయ చౌదరి బలోపేతం చేశారు. చివరి నిమిషంలో తెరపైకి మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి పేరు రావడంతో వివాదం రాజుకుంది.
ఏలూరు: ఏలూరు ఎంపీ సీటుపై బీజేపీ(BJP)లో అసంతృప్తి రగులుతోంది. బీజేపీని బలోపేతం చేసి పార్టీ కోసం కష్టపడ్డ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరికి సీటివ్వాలంటూ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు పార్లమెంట్‌లో గత కొన్నేళ్లుగా బీజేపీని గారపాటి సీతారామాంజనేయ చౌదరి బలోపేతం చేశారు. చివరి నిమిషంలో తెరపైకి మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి పేరు రావడంతో వివాదం రాజుకుంది. మరోవైపు టీడీపీలో స్థానికేతరుడుకి సీటు కేటాయిస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
ఈనెల 15వ తేదీన పార్టీలకతీతంగా ఆత్మీయ సమావేశానికి గారపాటి చౌదరి పిలుపునిచ్చారు. బీజేపీకి ఇవ్వకుంటే ఊరుకునేది లేదంటూ గారపాటి చౌదరి అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీల ఆహ్వానం మేరకు స్పందించాలని గారపాటి చౌదరి అభిమానులు కోరుతున్నారు. రేపు(బుధవారం) సాయంత్రం బీజేపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గారపాటి చౌదరి పేరు లేకుంటే రెబల్ గా పోటీ చేయాలంటూ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. ఈ నెల 15వ తేదీన ఏలూరులో ఆత్మీయ సమావేశంలో కీలక ప్రకటన చేయనున్నారు. గత 16 ఏళ్లుగా జిల్లాలో తపన ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాల్లో గారపాటి చౌదరి సేవ చేస్తున్న విషయం తెలిసిందే.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి