Share News

తిరుమలలో ఎడతెరపిలేని వర్షం

ABN , Publish Date - Dec 01 , 2024 | 05:19 AM

తుఫాను ప్రభావంతో తిరుమలలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.

తిరుమలలో ఎడతెరపిలేని వర్షం

Andhrajyothi Desk : తుఫాను ప్రభావంతో తిరుమలలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. శ్రీవారి ఆలయ ప్రాంతం, మాడవీధులు, అఖిలాండం, అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, రోడ్లు, కాటేజీలు, బస్టాండ్‌, పార్కులు తడిసి ముద్దయ్యాయి. చలి గాలులతో కూడిన వర్షానికి యాత్రికులు వణికిపోయారు. సాయంత్రం నుంచి భక్తులు గదులకే పరిమితమయ్యారు. సాయంత్రం ఆలయం ముందు నిర్వహించే సహస్రదీపాలంకరణ సేవను వైభవోత్సవ మండపంలో నిర్వహించారు.

Updated Date - Dec 01 , 2024 | 05:19 AM